Father’s Day 2021: వేలు పట్టుకుని లోకాన్ని చూపించే నాన్నకు వందనం, అందరికీ పితృ దినోత్సవం శుభాకాంక్షలు, ఫాదర్స్ డే విషెస్ , కోట్స్, వాట్సప్ మెసేజెస్ మీకోసం
Happy Father’s Day 2020

అమ్మ నవమాసాలు మోసి బిడ్డకు ప్రాణం పోస్తే.. నాన్న ఆ బిడ్డకు జీవితాన్ని అందిస్తారు. వేలు పట్టి నడిపిస్తూ లోకాన్ని చూపుతాడు. తాను కరుగుతూ ఇంటికి వెలుగునిచ్చే మహోన్నత వ్యక్తి నాన్న. తప్పటడుగులు సరిదిద్ది బిడ్డల భవిష్యత్తు కోసం తపన పడే నిస్వార్థపు మనిషి. బయటకు గంభీరంగా కనిపించినా.. మనసులో బోలెడంత ప్రేమను దాచుకుంటాడు. పిల్లల భవిత కోసం తన వ్యక్తిగత సంతోషాన్ని సైతం త్యజించే త్యాగమూర్తి నాన్న. నాన్నంటే ఓ ధైర్యం.. నాన్నంటే బాధ్యత.. నాన్నంటే ఓ భద్రత, భరోసా. కన్నబిడ్డలే జీవితంగా బతుకుతాడు.

జీవితాంతం పిల్లలను తన గుండెలపై మోస్తాడు. ఈ క్రమంలో తన అవసరాలు, ఆరోగ్యం అన్నింటినీ పక్కనబెడతాడు. తన బిడ్డల ఎదుగుదలను మురిసిపోతాడు. పిల్లలు ఏదైనా సాధిస్తే చిన్న పిల్లాడిలా సంబరపడిపోతాడు. అలాంటి నాన్నను ఏడాదిలో ఒక్కసారైనా గౌరవించడం మన బాధ్యత. అందుకే ఏటా జూన్ మూడో ఆదివారం రోజున ‘ఫాదర్స్ డే’ను (Father’s Day 2021) నిర్వహిస్తున్నారు.

ఫాదర్స్ డేను మొదటిసారిగా అమెరికాలో సెలబ్రేట్ చేశారు. 1910 జూన్ మూడో ఆదివారం నాడు వాషింగ్టన్ వైఎంసీఏలోని స్పోకేన్‌లో సోనోరా స్మార్ట్ డాడ్ ఫాదర్స్ డే సెలబ్రేట్ చేశారు. అప్పుడు జూన్ 19న ఫాదర్స్ డే వచ్చింది. అయితే అప్పటికే ఏటేటా మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న సోనోరా స్మార్ట్ డాడ్ తండ్రులకు కూడా ఓ రోజు ఉండాలని భావించారామె. సోనోరా తండ్రి పేరు విల్లియం జాక్సన్ స్మార్ట్. ఆరుగురు పిల్లలకు తండ్రి. కష్టపడి ఆరుగురు పిల్లల్ని పెంచి పెద్ద చేశారు. తన తండ్రి కష్టాలను, బాధ్యతల్ని దగ్గర్నుంచి చూసిన సోనోరా ఫాదర్స్ డే ఉండాల్సిందే అనుకున్నారు.

పితృ దినోత్సవం ఎప్పుడు మొదలైంది? ఎన్ని దేశాల్లో అంతర్జాతీయ పితృ దినోత్సవం జరుపుకుంటున్నారు, హ్యాపీ ఫాదర్స్ డే WhatsApp Stickers, Facebook Greetings, GIF Images, SMS and Messages మీకోసం

ఈ విషయాన్ని చర్చ్ పాస్టర్‌తో చర్చించారు. తన తండ్రి పుట్టిన రోజు అయిన జూన్ 5న ఫాదర్స్ డే సెలబ్రేట్ చేయాలనుకున్నారు. కానీ చర్చి వేళలు కలిసిరాకపోవడంతో ఫాదర్స్ డే జూన్ మూడో ఆదివారానికి వాయిదా పడింది. అలా ప్రతీ ఏడాది జూన్ 3వ ఆదివారం పితృ దినోత్సవం జరుపుకొనే ఆనవాయితీ అమెరికాలో ప్రారంభమైంది. ఆ తర్వాత ఇతర దేశాల్లోనూ ఇదే రోజున పితృ దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. కొన్నేళ్లుగా భారతదేశంలో కూడా ఫాదర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. తండ్రులందరికీ లేటెస్ట్‌లీ తరపున శుభాకాంక్షలు

ఈ సందర్భంగా కింది కోట్స్ ద్వారా మీ తండ్రికి ‘ఫాదర్స్ డే’ విషెస్ చెప్పండి.

నాన్న.. నా మొట్టమొదటి గురువు,

నా బెస్ట్ ఫ్రెండ్ మీరే.. హ్యాపీ ఫాదర్స్ డే

గెలిచినప్పుడు పదిమందికి చెప్పుకునే వ్యక్తి..

ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే అని

దగ్గరకు హత్తుకునే వ్యక్తి నాన్న ఒక్కరే

ఫాదర్స్ డే శుభాకాంక్షలు

నాకు గురువు నాన్నే

అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన గొప్ప తండ్రి.

ఓర్పుకు, సహనానికి మారుపేరు నాన్న. తండ్రులందరికీ పితృ దినోత్సవ శుభాకాంక్షలు

నాన్న ఎప్పుడూ నాకు మొదటి స్నేహితుడు, ఆత్మ బంధువు, గురువు, దైవం అన్నీ నాన్నే.. అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు

నాన్న అంటే నమ్మకం, ఆత్మస్థయిర్యాన్ని పెంచే ఆయుధం. పితృ దినోత్సవ శుభాకాంక్షలు

ఓడినప్పుడు ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా నేనున్నా కన్నా అంటూ ధైర్యం చెప్పే ఒకే ఒక వ్యక్తి నాన్న. ఫాదర్స్ డే శుభాకాంక్షలు

నాన్న మాటల్లో ప్రేమ ఉంటుంది. కోపంలో బాధ్యత ఉంటుంది. అణుక్షణం బిడ్డ గురించే అతని ఆలోచనలు. ప్రతి తండ్రికీ పితృ దినోత్సవ శుభాకాంక్షలు

నాన్న నా ఆశ. నా శ్వాన. నాన్నా అందుకో పితృ దినోత్సవ శుభాకాంక్షలు

దేవుడు నాకు ఇచ్చిన గొప్ప బహుమతి నాన్న, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి. హ్యాపీ ఫాదర్స్ డే

ఎవరూ తెలియని ఈ లోకంలో యువరాజుగానో, యువరాణి గానో మనల్ని పరిచయం చేసి, మన తప్పుటడుగులను దిద్ది , మనల్ని చదివించి సమాజానికి ఉన్నతంగా పరిచయం చేసే నాన్నే మన సూపర్ హీరో.

తండ్రిని గౌరవించడం, ప్రేమించడం తప్ప ఫాదర్స్ డే సందర్భంగా మన నాన్న కు ప్రత్యేకంగా ఇవ్వాల్సిందేముంది. ప్రపంచానికి చెప్పాల్సిందేముంది. నాన్నను గౌరవించటానికి ఫాదర్స్ డే అవసరం లేదు . నాన్న గొప్పతనం చెప్పటానికి ఇది ఒక సందర్భం మాత్రమే .. నాన్నను ప్రేమించటానికి ఒక్కరోజు మాత్రమే చాలదు, ప్రతిరోజు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మనం కృతజ్ఞులమై ఉండాలి. ఐ లవ్ యూా నాన్న..