Bubble Tea Doodle: బబుల్ టీ వేడుకలు, గూగుల్ డూడుల్ ద్వారా సెలబ్రేట్ చేసుకుంటున్న బబుల్ చాయ్ గురించి ఎవరికైనా తెలుసా, తైవాన్ దేశానికి చెందిన రెసిపీ గురించి ఓ సారి తెలుసుకుందామా..
Bubble Tea Google Doodle (Photo-Google)

గూగుల్ ఈ రోజు (శనివారం) తన డూడల్ హ్యాండిల్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆదరణ పొందిన ‘బబుల్ టీ’ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంటోంది. ఇందులో భాగంగా గూగుల్ బబుల్ చాయ్ (bubble Tea) పేరుతో డూడుల్ విడుదల చేసింది. బబుల్ టీ అనేది తైవాన్ దేశానికి చెందిన రెసిపీ (Celebrating Bubble Tea).ఈ చాయ్​ని పాలు పండ్లు ఫ్రూట్ జ్యూస్ లతో కలిపి తయారు చేస్తారు.బబుల్ టీని బోబా టీ, పెర్ల్ మిల్క్ టీ అని కూడా పిలుస్తుంటారు. రుచితో సంబంధం లేకుండా అన్ని రకాల ఇంగ్రీడియన్స్ కలిపి తయారు చేస్తుంటారు.

ఇందులో గూగపియోకా పెర్ల్స్ ను చేర్చి పండ్లతో బాగా మిక్స్ చేసి బబుల్ టీని (Taiwanese Of Bubble Tea) సిద్ధం చేస్తారు. టాపియోకా పెర్ల్స్ అంటే  బుల్ చాయ్​ అడుగు భాగంలో ఉండే బ్లాక్ కలర్​ బాల్స్. టాపియోకా స్టార్చ్ అనే పిండి పదార్ధం ద్వారా ఈ పెర్ల్స్ తయారు చేస్తారు.  మనం కర్ర పెండలం దుంపగా పిలుచుకునే మొక్క నుండి దీన్ని తయారు చేస్తారు.కర్రపెండలం మొక్క నుంచి తయారు చేసిన స్టార్చ్ నుంచి తిరిగి ప్రత్యేక పద్ధతి ద్వారా టాపియోకా పెర్ల్స్ ను వండుతారు. వాటిని బబుల్ చాయ్ లో వాడుతారు.

పరగడపున టీ, కాఫీ బదులుగా, వీటిని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే, రోజంతా జింక పిల్లలా శక్తితో ఉంటారు...

ఈ చాయ్​ను సిద్ధం చేసిన తర్వాత వినియోగదారులకు ఇస్తున్నప్పుడు ఒక పెద్ద స్ట్రాను కూడా ఇస్తారు. ఆ స్ట్రా ద్వారా చాయ్​ తోపాటు ఈ టాపియోకా పెర్ల్స్ కూడా నోటిలోకి వచ్చేస్తాయి. ఈ రెండింటి కలయికతో అద్భుతమైన టేస్ట్​ను ఆస్వాదిస్తారు జనం.గూగుల్​ 2020 జనవరి 29న బబుల్ చాయ్ ఎమోజీని యానిమేటెడ్ వీడియో ద్వారా లాంచ్ చేసింది.అప్పటి నుంచి దేశవ్యాప్తంగా బబుల్ టీకి గుర్తింపు వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ జనవరి 29న డూడుల్ (Bubble Tea Google Doodle) ద్వారా సెలబ్రేట్​ చేస్తోంది.

కేరళలో మళ్లీ నోరోవైరస్ కలకలం, 19 మంది విద్యార్థుల్లో నోరోవైరస్ గుర్తించిన అధికారులు, నమోదైన కేసులన్నీ చిన్నారులవే..

17వ శతాబ్దం నుంచి తైవాన్‌లో బబుల్ టీ అందరికీ అందుబాటులోనే ఉంది. కరోనా సమయంలోనే దీనికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు. ఈ బబుల్ టీలో పాలతోపాటు టాంగీ, ఫ్రూట్స్, బొబా బాల్స్, ఇతర ఇంగ్రీడియన్స్ కలుపుతారు. రుచితోపాటు శరీర సామర్థ్యాన్ని, శక్తిని పెంచుతుంది. కరోనా సమయంలో బబుల్ టీని క్రేజ్ విపరీతంగా పెరిగింది. అప్పటి నుంచి ఈ టీని తాగేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు.ఈ టీ ఆసియా ఖండం మొత్తం వ్యాపించింది. సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా, ఇలా చాలా వరకు దేశాల్లో బబుల్ టీకి ఆదరణ లభించింది.