చీకటిని దూరం చేసి, మనకు సరైన జీవన మార్గాన్ని చూపే వారు గురువులు. గురు పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఇది ఆషాఢంలో వచ్చే ముఖ్యమైన పండుగ. పంచాగం ప్రకారం, ఈ పండుగను ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం గురు పూర్ణిమ 21 జూలై 2024 న జరుపుకుంటారు. గురు పూర్ణిమ ప్రాముఖ్యత గురు, శిష్యుల పవిత్ర సంబంధాన్ని సూచిస్తుంది. ఈ రోజున, శిష్యులు తమ గురువు పట్ల కృతజ్ఞతలు తెలుపుతారు. అతని జ్ఞానం, మార్గదర్శకత్వం కోసం ఆయనను గౌరవిస్తారు. గురు పూర్ణిమ చరిత్ర, ప్రాముఖ్యత గురించి కూడా తెలుసుకుందాం. ఆది గురువుగా పరిగణించబడే వేదవ్యాసుడు గురు పూర్ణిమ రోజున జన్మించాడు. వేద వ్యాసుడు మహాభారతం, వేదాలు, పురాణాలతో సహా అనేక ముఖ్యమైన గ్రంథాలను రచించాడు. అంతేకాకుండా, ఈ రోజున, బుద్ధుడు తన మొదటి ఐదుగురు శిష్యులకు కూడా బోధించాడు. అంతేకాదు గురుపరంపరలో భాగంగా శిరిడీ సాయిబాబాను ఈ రోజు ప్రత్యేకంగా పూజిస్తారు. గురుపౌర్ణమి రోజు సాయిబాబా గురుపీఠానికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు.
గురుబ్రహ్మ గురువిష్ణు, గురుదేవో మహేశ్వరహ
గురుసాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః
మీకు, మీ కుటుంబ సభ్యులకు గురుపౌర్ణమి శుభాకాంక్షలు.
సంపూర్ణంగా భూమండలం అంతటా వ్యాపించి ఉన్న భగవంతున్ని ఏ పదం దర్శింపజేస్తుందో ఆ తత్వాన్నీ బోధించుచున్న గురువులకు నమస్కరిస్తూ గురుపౌర్ణమి శుభాకాంక్షలు .
గురువు చేసే మేలు అనంతం,
నేర్పే దారులు అనేకం. గురువు ఒక అద్భుతం.
గురుపౌర్ణమి సందర్భంగా
గురువులందరికీ ఇవే నా శుభాకాంక్షలు.
మంచిని ప్రభోదించి, జ్ఞానజ్యోతిని వెలిగించే గురువులందరికీ "గురుపౌర్ణమి" శుభాకాంక్షలు.
మానవ జాతికి ఆధ్యాత్మికతను నింపిన వ్యాస మహర్షి జన్మదినం సందర్భంగా మనం గురుపౌర్ణమి జరుపుకుంటాం..మన జీవితాన్ని అంధకారం నుంచి అభివృద్ధి వైపు నడిపించిన గురువులందరికి గురుపౌర్ణమి శుభాకాంక్షలు.