Bhogi Wishes in Telugu: తెలుగు వారు జరుపుకునే అతి పెద్ద పండుగలలో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు చాలా ముఖ్యమైనవి. వరుసగా మూడు రొజుల పాటు ఈ పండుగలను జరుపుకుంటారు. ఈ పండుగ వస్తుందంటే చాలు.. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సంబరాలు ఆకాశాన్ని తాకుతాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఉదయాన్నే భోగి మంటలు వేసి... శీతాకాలానికి గుడ్ బై చెబుతారు. ఇంటింటా ముగ్గులతో తెలుగు ఇళ్లు కళకళలాడుతుంటాయి.
కుటుంబ సభ్యులు, బంధువులు, చుట్టాలతో తెలుగు లోగిళ్లలో సందడి వాతావరణం కనిపిస్తోంది. ప్రజలంతా సంతోషంగా భోగి (Happy Bhogi 2021), సంక్రాంతి పండుగలు జరుపుకోవాలని రాజకీయ నేతలు, ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు కోరుతూ... తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ శుభాకాంక్షలు పంపుతున్నారు.
మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు
ఇంటికొచ్చే పాడిపంటలు, కమ్మనైన పిండివంటలు, చలికాచే భోగి మంటలు, సంతోషంగా కొత్త జంటలు, ఏటేటా సంక్రాంతి ఇంటింటా కొత్త కాంతి
గతానికి వీడ్కోలు పలుకుతూ, రేపటి జీవిత సంక్రాంతికి స్వాగతం పలికే, భోగి పండుగ సందర్భంగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు
మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు
నిజమైన ఆనందాన్ని అనుభవించడమే నిజమైన భోగం. మనకు లభించిన దానితో తృప్తిపడకుండా ఇంకొకటి కావాలని ఆశిస్తే అది భోగం అనిపిచుకోదు. లభించిన దానితో పరిపూర్ణమైన ఆనంద పొందగలిగితే అదే నిజమైన భోగం