May-Day-Greetings-1

Happy Labour Day Messages in Telugu: మే దినోత్సవం లేదా మే డే ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం. ప్రజా శెలవుదినం. చాలా దేశాలలో మే దినం, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా కార్మిక దినోత్సవంతో ఏకీభవిస్తాయి. ఇవి అన్నీ కూడా కార్మికుల పోరాటం, కార్మికుల ఐక్యతను గుర్తిస్తాయి. కొన్ని పురాణగాథలు కొన్ని రోజులను పండుగలుగా మార్చాయి.మేడే రోజంటేనే కార్మికుల పండుగ. అన్ని వర్గాల కార్మికులు ఎంతో ఆనందంగా, సంతోషంగా మేడే ఉత్సవాలను జరుపుకుంటారు.

ప్రపంచ కార్మికులారా ఏకంకండి.. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప.’ అని మార్క్సిస్టు నేత కార్ల్‌మార్క్స్‌ ఇచ్చిన నినాదం ప్రపంచ కార్మికులను ఉత్తేజపరిచి పోరాటంలోకి మరింత ముందుకు నడిపించింది. 1886కు ముందు ప్రపంచ వ్యాప్తంగా 18 గంటలు, 16 గంటల ప ని విధానాలు అమల్లో ఉండేవి. యజమానులు కార్మికుల శ్రమను దోచుకునేవారు. ఈ దోపిడీ విధానం పోవాలంటూ ప్రపంచ కార్మికులు అన్ని దేశాల్లో పోరాటాలు మొదలుపెట్టారు.  మే దినోత్సవం, కరోనా దెబ్బకు ప్రమాదకరంగా మారిన కార్మికుల ఉపాధి, పది కోట్ల మంది దారిద్య్రంలో మగ్గిపోతారని ప్రపంచ బ్యాంక్‌ ఆందోళన

అమెరికా దేశంలో చికాగో నగరంలోని గడీలలో, కార్ఖానాల్లో పనిచేసే కార్మికులు తమకు పనికి తగ్గ వేతనం కావాలంటూ ధర్నా మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అక్కడి యాజమానులు, భూస్వాములు కలిసి కార్మికులకు పనికి తగిన వేతనం ఇవ్వకుండా వారిని పొట్టున పెట్టుకున్నారు. వందలాది మంది కార్మికులను అక్కడి భూస్వాములు చంపివేశారు.

ఆ రక్తపు మడుగులోంచి కార్మికుల్లో ఒకరు రక్తంతో తడిసిన తన చేతి రుమాలును తీసి కార్మిక జెండాగా పైకి ఎగురవేశారు. ఆనాటి నుంచి మే 1ని ప్రపంచ కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అనేకమంది తమ ప్రాణాలను తృణపాయంగా అర్పించి శ్రమదోపిడీపై విజయం సాధించారు. 1886 మే 1 నుంచి 8 గంటల పని విధానం అమల్లోకి వచ్చింది.

May-Day-Greetings-1

కార్మికుల దినోత్సవం శుభాకాంక్షలు

May-Day-Greetings-1

శ్రామికుల దినోత్సవం శుభాకాంక్షలు

May-Day-Greetings In Telugu

మే డే శుభాకాంక్షలు

May-Day Wishes in Telugu

ప్రపంచ కార్మికులారా ఏకంకండి.. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప

May Day Wishes in Telugu

నేడే మే డే నోయ్..ఈనాడే మే డే నోయ్..

లేటెస్ట్‌లీ తరపున కర్షక లోకానికి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు