Best Makar Sankranti Wishes: మకర సంక్రాంతి లేదా సంక్రాంతి భారతదేశంలోని హిందూ పండుగల్లో అత్యంత ముఖ్యమైన పండుగ. సంక్రాంతి పండుగనే (Sankranthi 2022 Wishes) దేశంలో చాలా వైభవంగా జరుపుకుంటారు. మనదేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండగను కొన్ని రాష్ట్రాల్లో మాఘి అని కూడ పిలుస్తారు. ఈ పండగ సూర్య భగవానుడికి అంకితం అని చెబుతుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది జనవరి మాసంలో జరుగుతుంది. సాధారణంగా సంక్రాతి ప్రతి ఏటా జనవరి 14వ తేదీ జరుగుతుంది. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే జనవరి 15వ తేదీన జరుపుకుంటారు.
సంక్రాంతి లేదా సంక్రమణము- అంటే "మారడం" అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది జనవరి మాసంలో వస్తుంది.
సంక్రాంతి మూడు రోజుల విశిష్టత, జరుపుకునే విధానం గురించి తెలుసుకుందాం,
మకర సంక్రాంతి రోజున, అంటే జనవరి 15 తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి.ఈ విషెస్ ద్వారా మీరు మీ బంధువులకు, స్నేహితులకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేయండి
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
మీకు మీ బంధు మిత్రులకు, కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు
చెరకులోని తీయదనం.. పాలలోని తెల్లదనం.. గాలిపటంలోని రంగుల అందం.. మీ జీవితాల్లో ఆనందం నింపాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు
కళకళలాడే ముంగిట రంగవల్లులు.. బసవన్నల ఆటపాటలు.. మీకు సంతోషాన్ని పంచాలని కోరుకుంటూ.. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
ఈ సంక్రాంతి అందరికీ ఆనందాన్ని పంచాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు