Visit My Mosque: అనుమానం వీడండి, మా మసీదుని సందర్శించండి, నేటి నుంచి హైదరాబాద్ లో విజిట్ మై మసీద్ కార్యక్రమం ప్రారంభం, అన్ని మతాల వారికి మసీదులోకి ఆహ్వానం పలికిన కమిటీ, మత సామరస్యం వెల్లివిరియాలని వినూత్న ప్రయత్నం..
Ramzan Mubarak | Representational Image | (Photo Credits: Pixabay)

Hyderabad:  విజిట్ మై మసీద్ కార్యక్రమం జూలై 17న ఉదయం 10 నుండి సాయంత్రం 7 గంటల వరకు మాదాపూర్‌లోని 100 అడుగుల రోడ్డులోని గుట్టల బేగంపేటలోని మస్జిద్-ఎ-ఆలంగీర్ వద్ద జరుగనుంది.

ఈవెంట్ నిర్వాహకుల ప్రకారం, అన్ని మతాలు, లింగ వివక్ష లేకుండా ప్రజలు తమ మసీదులను సందర్శించాలని, అసలు ప్రార్థనా స్థలాలలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని వారు కోరుకుంటున్నారు. అనుమానాలు వీడి అందరం మానవ సమాజం అభివృద్ధి కోసం పాటుపడాలని హితవు పలికారు.

Odisha Shocker: భార్య శీలంపై అనుమానం, తలనరికి 12 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిన వ్యక్తి, పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు, భార్యశవంతో రాత్రంతా ఏం చేశాడంటే? 

“మతాల వారీగా చిచ్చుపెడుతున్న ఈ వాతావరణంలో, విజిట్ మై మసీద్ కార్యక్రమం ద్వారా మత సామరస్యంపై తాము దృష్టి సారించినట్లు నిర్వాహకులు తెలిపారు. దేశంలోని మిశ్రమ సంస్కృతిని, హైదరాబాద్ సంస్కృతి అయిన గంగా-జమున సంగమాన్ని నొక్కి చెప్పడమే మా ప్రయత్నమని తెలిపారు. మత సామరస్యం ఉంటే తప్ప బంగారు తెలంగాణ కల సాకారం కాదనేది మా నమ్మకం' అని నిర్వాహకులు శనివారం ఇక్కడ ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాల కోసం, సంప్రదించండి: 9849093503, 9839583876