ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ స్కూల్లోనూ కాలేజీలోనూ కార్యాలయంలోనూ లేదా బహిరంగ ప్రదేశాల్లో స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించి మంచి ఉపన్యాసం ఇవ్వాలి అనుకుంటున్నారా అయితే ఇక్కడ సులభమైన పదాలతో ఒక చక్కటి స్పీచ్ను మేము రూపొందించాం. దీన్ని మీరు తెలియజేయడం ద్వారా స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని నలుగురిలో రగిలించవచ్చు .అలాంటి చక్కటి ఉపన్యాసం మీకోసం ఇక్కడ రూపొందించాం.
మన దేశం రెండు వందల సంవత్సరాల బానిస సంకెళ్ళను తెంచుకొని స్వతంత్ర దేశంగా ప్రపంచం ముందు సగర్వంగా తలెత్తుకుంది. ఆగస్టు 15వ తేదీ యావత్ ప్రపంచానికి భారతదేశం సగర్వంగా తలెత్తుకున్న రోజుగా మనం చెప్పవచ్చు. పూజ బాపూజీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ,సుభాష్ చంద్రబోస్ ,భగత్ సింగ్ లాంటి వీరులు భారత స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. వారి స్ఫూర్తితో మన దేశం నేడు గడచిన ఏడున్నర దశాబ్దాలుగా ముందడుగు వేస్తోంది. నేడు మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉంది 140 కోట్ల మంది జనాభాతో మన దేశం యావత్ ప్రపంచానికి ఒక మార్గదర్శక నిలుస్తోంది.
Health Tips: నాన బెట్టిన శనగలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ..
ఈరోజు మనం మన దేశంలో భద్రంగా సురక్షితంగా ఉంటున్నామంటే సరిహద్దుల్లో ఉన్న సైనికులు మన అందరి కోసం ప్రాణాలకు సైతం తెగించి సరిహద్దులను కాపాడుతున్నారు. అన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున ఆ వీర జవాన్లకు మనం సంఘీభావం తెలపాలి. అలాగే ఈ దేశ స్వాతంత్రం కోసం ఉరికోయలను సైతం ముద్దాడిన స్వాతంత్ర సమరయోధులను గుర్తుంచుకోవాలి. అలాగే ఈ దేశ రక్షణ కోసం యుద్ధంలో కన్నుమూసిన అమర జవాన్లకు మనం సంఘీభావం తెలపాలి.
భారతదేశం నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ జాతి నిర్మాణంలో మనం ప్రతి ఒక్కరం భాగస్వామ్యం అవ్వాలంటే భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రతి ఒక్కరు శ్రద్ధాసక్తులతో తాము చేయాల్సిన పని పట్ల నిబద్ధతతో ఉండాలి. దేశభక్తి అనేది కేవలం సినిమా పాటలు క్రికెట్ స్టేడియంలో నినాదాలు ఇవ్వడం కాదు దేశభక్తి అంటే ప్రతి ఒక్కరి మనసులోనూ దేశం పట్ల ఒక బాధ్యతను పెంపొందించేలా ఉండాలి. అప్పుడే మన దేశం అగ్రరాజ్యంగా ప్రపంచానికి ఒక మార్గదర్శిగా నిలుస్తుంది. జైహింద్