International Women's Day Telugu Wishes: మహిళలను ఆకాశంలో సగం అవనిలో సగం అంటారు. అటువంటి మహిళా లోకం శక్తికి ప్రతీకగా నిర్వహించే పండుగ, మహిళలంతా సంతోషంగా జరుపుకునే వేడుక, మహిళా సాధికారత దిశగా నడిపించటం కోసం నిర్వహించే సంబరమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుండి పుట్టుకొచ్చింది.
దాదాపు శతాబ్దానికి ముందు నుంచే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు మార్చి 8వ తేదీన మహిళలకు ప్రత్యేకమైన రోజుగా గుర్తించి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుతున్నారు. 1908లో తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం యూఎస్ లోని న్యూ యార్క్ సిటీలో 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు.
నాడు మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది.అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపే మెసేజ్ లు మీ కోసం..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళాలోకానికి హృదయపూర్వక శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే
మహిళ దినోత్సవం శుభ తరుణాన స్త్రీ మూర్తులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారీ లోకానికి శుభాకాంక్షలు
నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన నా ప్రియమైన అమ్మకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు
నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన నా ప్రియమైన అమ్మకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు