Mini Medaram Jatara 2021: సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతర, ఫిబ్ర‌వ‌రి 24 నుంచి 27 వరకు మినీ మేడారం జాతర, ఫిబ్రవరి 22 నుంచి పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
Medaram Jathara 2020 | File Photo

గిరిజనుల ఆరాధ్య దైవంగా కొలుస్తున్న సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతర ఫిబ్ర‌వ‌రి 24 న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో చిన్నజాతరకు (mini medaram jatara) ముందే వన దేవతలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. గద్దెలపై సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను (sammakka saralamma jatara) దర్శించుకొని పసుపు, కుంకుమ, పువ్వులు, నైవేద్యం, చీరెలు సమర్పించి.. కొబ్బరికాయ కొట్టి మొక్కు చెల్లించుకుంటున్నారు.. ఆదివారం సెలవుదినం కావడంతో ఉదయం నుంచే రాష్ట్రం నలుమూలలతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్​ నుంచి అమ్మవార్లను దర్శించుకునేందుకు భారీగా భక్తజనం తరలించారు.

జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించి వనదేవతల సన్నిధికి చేరుకుంటున్నారు. గద్దెలపై సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకొని పసుపు, కుంకుమ, పువ్వులు, నైవేద్యం, చీరెలు సమర్పించి.. కొబ్బరికాయ కొట్టి మొక్కు చెల్లించుకుంటున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను దర్శించుకుంటున్నారు. ఇదిలాఉండగా మేడారంలో ఈ నెల 24 నుంచి 27 వరకు ఆనవాయితీగా చిన్న జాతర జరుగనున్న విషయం తెలిసిందే.

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రానికి అనుబంధ ఆలయంగా కొనసాగుతున్న పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (pathagutta-bramhostavalu) అంగరంగ వైభవంగా జరిపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దేవాదాయ, ధర్మాదాయ కమిషనర్‌ ఆదేశాల మేరకు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అలంకార సేవలు యథావిధిగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 22 నుంచి పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, మాతృభాష అంటే ఉనికి, అస్తిత్వానికి ప్రతీక అంటూ ఏపీ సీఎం ట్వీట్, ఈ దినోత్సవం చరితను ఓ సారి తెలుసుకుందామా..

సోమవారం ఉదయం 9 గంటలకు స్వస్తీవాచనంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆలయ ఈఓ గీత తెలిపారు. అనంతరం రక్షాబంధనం, పుణ్యహవాచనం, సాయంత్రం 5 గంటలకు అంకురార్పణం, మృత్సంగ్రహణం, 23న ఉదయం 10గంటలకు ధ్వజారోహణం, వేదపారాయణాలు, సాయంత్రం 5గంటలకు భేరిపూజ, దేవతాహ్వానం, 24న ఉదయం 6 గంటలకు హవనం, సింహవాహన అలంకార సేవ, సాయంత్రం 7గంటలకు ఎదుర్కోలు(అశ్వవాహనం), 25న ఉదయం 8గంటలకు హవనం, తిరుమంజనోత్సవం, హనుమంత వాహనం, సాయంత్రం 7గంటలకు స్వామివారి కల్యాణోత్సవం(గజవాహనం), 26న ఉదయం 8గంటలకు గరుడవాహనం, సాయంత్రం 5గంటలకు రథాంగహోమం, 7 గంటలకు రథోత్సవం, 27న ఉదయం 10గంటలకు పూర్ణాహుతి, మధ్యాహ్నం 12గంటలకు చక్రతీర్థ స్నానం, 7 గంటలకు పుష్పయాగం, డోలారోహణం, 28న ఉదయం 9గంటలకు శతఘటాభిషేకం, ఒంటిగంటకు మహాదాశీర్వచనం, పండిత సన్మానంతో ఉత్సవాలకు పరిసమాప్తి పలుకుతామని వివరించారు.

ఇప్పటికే ఆలయానికి రంగులు వేసి, లైటింగ్‌ ఏర్పాటు చేశారు. స్వామివారి రథాన్ని తీర్చిదిద్దారు. కృష్ణశిల రాయిని తలపించేలా పెయింటింగ్‌ వేయించారు. ప్రధానాలయం చుట్టూ గోడలతోపాటు, ఆలయం బయట ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలు కనువిందు చేస్తున్నాయి. స్వామివారి కల్యాణం, ఎదుర్కోలు, రథోత్సవం, ఊరేగింపులో వినియోగించే అశ్వవాహనం, హనుమంత, గజ, గరుడవాహనాలను సిద్ధం చేశారు. భక్తులు సేద తీరేందుకు చలువ పందిళ్లు వేశారు.