
Ramadan Wishes in Telugu: పవిత్ర రంజాన్ మాసం ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. రంజాన్ మాసం... ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల. రంజాన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఉపవాసం పాటిస్తారు. రంజాన్ మాసం ప్రారంభం చంద్రుని దర్శనంపై ఆధారపడి ఉంటుంది. రంజాన్ మార్చి 22 లేదా మార్చి 23న ప్రారంభమై ఏప్రిల్ 21 లేదా ఏప్రిల్ 22న ఈద్-ఉల్-ఫితర్ రోజున ముగుస్తుందని భావిస్తున్నారు. రంజాన్ మాసం ప్రారంభం, ముగింపు నిర్ణయించడానికి నెలవంక దర్శనం ముఖ్యం.
ఈ ఉపవాస సమయంలో ప్రజలు సెహ్రీ, ఇఫ్తార్ చేస్తారు.రంజాన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఉపవాసం పాటిస్తారు. సూర్యోదయానికి ముందు తీసుకునే భోజనాన్ని సెహ్రీ అని, సూర్యోదయం తర్వాత తీసుకునే భోజనాన్ని ఇఫ్తార్ అని అంటారు. పవిత్ర రంజాన్ మాసంలో, ఉపవాసం ఉండే వ్యక్తి సరైన సమయంలో సెహ్రీ, ఇఫ్తార్ కలిగి ఉండటం చాలా ముఖ్యం. సెహ్రీ తర్వాత, రోజంతా ఏదైనా తినడం, త్రాగడం నిషేధించబడింది. సాయంత్రం నమాజ్ చేసిన తర్వాత, సూర్యాస్తమయం సమయంలో ఇఫ్తార్ చేస్తారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మిత్రులకు శుభాకాంక్షలు చెప్పేయండి ఈ మెసేజ్‌లతో..

ముస్లింలకు ముఖ్యమైన ఐదు విధులైన ఈమాన్, నమాజ్, జకాత్, రోజా, హజ్‌లలో రోజాను రంజాన్ మాసంలో త్రికరణ శుద్ధితో ఆచరిస్తారు

ఉపవాసాన్ని అరబ్బీలో ‘సౌమ్’ అని, ఉర్దూ భాషలో ‘రోజా’ అనీ పిలుస్తారు. ఇస్లాంలో ‘రోజా’ అంటే ఉషోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆహారపానీయాలు సేవించకుండా మనోవాంఛలకు దూరంగా ఉండడం.

ఈమాన్- దైవత్వం పట్ల ప్రగాఢ విశ్వాసం, నమాజ్- ఎనిమిదేళ్లు దాటిన వారు విధిగా 5 సార్లు చేయాలి, రోజా- ఉపవాసదీక్షను 8 ఏళ్లు నిండి బాలబాలికలతో సహా అందరూ విధిగా పాటించాలి, జకాత్ / సద్కా- తమ స్థోమతను బట్టి నిర్దేశించిన స్థాయిలో దానధర్మాలు చేయడంగా చెప్పవచ్చు.