త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తారు. శనివారం శ్రీమహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన రోజు.ఈ రోజు శని దేవుడికి చెందినది. శని/శని గ్రహం యొక్క దుష్ప్రభావంతో బాధపడుతున్న వ్యక్తులకు ఆయనను ప్రార్థించడం వల్ల జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. ఇది చాలా పవిత్రమైన రోజు. ఈ పవిత్రమైన రోజున స్వామిని ప్రార్థించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
ఎందుకంటే శనిదేవుని అధీనంలో ఉండే తిథి, నక్షత్రం, వారం, మాసం శనివారం నాడు వస్తుంది కాబట్టి దానిని శని త్రయోదశి అంటారు. అర్ధాష్టమ శని, అష్టమ శని కాలంలో ఉన్న వ్యక్తులు శని యొక్క ప్రతికూల ప్రభావాన్ని జీరో చేయడానికి నివారణ చర్యలు చేస్తారు. శనివారం శ్రీమహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన రోజు. అలాగే త్రయోదశి పరమేశ్వరునికి ఇష్టమైన దినం.అందుకనే త్రయోదశి శనివారం నాడు వస్తే శివ కేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన దినమని పెద్దలు పేర్కొంటారు.
ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైన ఏలినాటి శని, అష్టమశని.. తదితర దోషాల నుంచి విముక్తి లభిస్తుందని పెద్దలు చెబుతారు. శనివారం నాడు శ్రీమహాలక్ష్మీ, నారాయణుడు అశ్వత్థవృక్షంపై ఉంటారని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకనే ఆ రోజున అశ్వత్థవృక్ష సందర్శన, ప్రదక్షిణ చేయాలి. శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయాలి. కాకికి నైవేద్యం పెట్టాలి. నల్లనువ్వులు, నువ్వుల నూనె, నల్లని వస్త్రంలో ఉంచి దానం చేయాలి.
శని త్రయోదశిని ఎలా పాటించాలి ?
రేపు తెల్లవారుజామున 6.30 నుండి 7.30 మధ్య ఉంటుంది (శని హోర అని కూడా పిలుస్తారు) ఈ సమయంలో రుద్రాభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
సాయంత్రం, "ప్రదోష సమయం" అంటే 5:30 నుండి 6:30 మధ్య సమయం, నువ్వుల నూనెతో దీపంను వెలిగించడం వలన విశేషమైన ప్రయోజనాలను పొందుతారు.
సూర్యోదయానికి ముందే తలస్నానం చేయాలి
నీలాంజన సమాభాసం.. రవిపుత్రం యమాగ్రజమ్.. ఛాయా మార్తాండ సంభూతం.. తం నమామి శనైశ్చరమ్ ఈ శని మంత్రాన్ని జపించాలి
శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలు ఉపవాసం పాటించాలి.
శని త్రయోదశి పూజలో భాగంగా ప్రజలు తైలాభిషేకం చేయాలి.
శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి నల్ల నువ్వులు కొన్ని, 100 గ్రాముల నువ్వుల నూనె ప్యాకెట్, 1 కిలో బొగ్గు, ఒక చిన్న నల్ల రిబ్బన్, 8 ఇనుప మేకులు, కొన్ని నవధాన్యాలు కట్టి, ఆలయ పూజారికి దానం చేయండి లేదా ప్రవహించే నదిలో వేయండి.
కాకికి ఆహార పదార్థాలను అందించి, అవసరమైన వ్యక్తికి ఆహారం దానంగా ఇవ్వండి.
ఈ శనివారం నూనె, గొడుగు, తోలు, నవధాన్యాలు.. మొదలైన వాటిని కొనుగోలు చేయవద్దు.