Subhadra Kumari Chauhan Google Doodle: సుభద్ర కుమారి చౌహాన్ ప్రముఖ హిందీ కవయిత్రి. తొమ్మిది రకాలైన రాస్ పద్ధతుల్లో ప్రధానంగా వీర్ రాస్ లో రచనలు చేశారు. ఉత్తర ప్రదేశ్లోని అలహాబాద్ జిల్లాలో ఉన్న నిహల్ పూర్ గ్రామంలో సుభద్ర కుమారి చౌహాన్ (Subhadra Kumari Chauhan) జన్మించారు. అలహాబాద్ లోని క్రాస్త్ వెయిట్ గర్ల్స్ పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేసిన ఆమె, 1919లో మిడిల్ స్కూల్ పరీక్ష పూర్తి చేశారు. అదే ఏడాది ఖండ్వా కు చెందిన ఠాకూర్ లక్ష్మణ్ సింగ్ చౌహాన్ ను వివాహం చేసుకున్నారు సుభద్ర. పెళ్ళి అయిన తరువాత జబల్ పూర్ కు మారిపోయారు.
1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరారు సుభద్ర. నాగపూర్ నుంచి అరెస్టు అయిన మొట్టమొదటి మహిళా సత్యాగ్రహి సుభద్ర కావడం విశేషం. 1923, 1942 సంవత్సరాల్లో సుభద్ర రెండు సార్లు అరెస్ట్ అయ్యారు. సుభద్రకుమారికి చిన్నప్పటి నుండి కవితలు (Subhadra Kumari Chauhan poems) రాయడం అంటే చాలా ఇష్టం. ఈ కారణంగా ఆమె పాఠశాలలో కూడా బాగా ప్రసిద్ధి చెందింది. సుభద్ర రాసిన రెండు కవితా సంకలనాలు, మూడు కథల సంకలనాలు ప్రచురితం అయినా ఆమె కవిత 'ఝాన్సీ కీ రాణి' చాలా ప్రసిద్ధి చెందింది.
ఆమెకు ఐదుగురు పిల్లలు. సుధ చౌహాన్, అజయ్ చౌహాన్, అశోక్ చౌహాన్, మమత చౌహాన్. మమత తప్ప మిగిలిన వారందరూ చనిపోయారు. మమత ప్రస్తుతం న్యూయార్క్లో ఉంటున్నారు. అజయ్, అశోక్ ల భార్యలు మధ్యప్రదేశ్లోని జబల్ పూర్లో ఉంటున్నారు. రైట్ టౌన్ లో సుభద్ర, ఆమె భర్త ఉన్న ఇంటిలోనే అశోక్ కుమారుడు నివాసం ఉంటున్నారు. ఆ వీధికి సుభద్ర కుమారి చౌహాన్ వార్డు అని పేరు మార్చడం విశేషం.
నేడు గూగుల్ ఆమె 11వ పుట్టిన రోజు (Subhadra Kumari Chauhan 117th Birth Anniversary) సందర్భంగా తన డూడుల్ ద్వారా విషెస్ తెలిపింది. గుర్రం మీద వెళుతున్నట్లుగా అలాగే స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నట్టుగానూ, అలాగే కవితలు రాస్తున్నట్లుగానూ ఫోటోనే ప్రచురించి ఆమెకు ఘనంగా నివాళి అర్పించింది.