India Independence Day 2021

వందల ఏళ్ళ బానిసత్వం నుంచి విడుదలయిన సంధర్భంగా భారత్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలను (India Independence Day 2021) జరుపుకుంటోంది. భారతదేశాన్ని బ్రిటీష్ వారు క్రమక్రమంగా ఆక్రమించుకుంటూ 18వ శతాబ్ది చివరకు దేశంలోని చాలా భాగాన్ని తమ పరిపాలన క్రిందకు, కొన్ని రాజ్యాలను తమ ప్రభావం క్రిందకు తీసుకువచ్చారు. 19వ శతాబ్ది తొలినాటికి వారి ఆధిపత్యం పూర్తిగా స్థిరపడిపోయింది. 1858 వరకూ భారత దేశ సార్వభౌమునిగా మొఘల్ పరిపాలకులే ఉన్నా 19వ శతాబ్ది తొలినాళ్ళ నుంచే ఆయన గౌరవాన్ని తగ్గిస్తూ వచ్చారు.

చివరకు 1857లో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం జరిగి భారత సిపాయిలు, రాజులు అందులో ఓడిపోయాకా 1858లో బ్రిటీష్ రాణి భారత సామ్రాజ్యధినేత్రి అయ్యాకా దేశం బ్రిటీష్ పాలన కిందకి వచ్చింది. బ్రిటీష్ పరిపాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేందుకు జరిగిన అనేకమైన పోరాటాల్లో ఎందరో దేశభక్తులు పాల్గొన్నారు. ప్రపంచ రాజకీయాల నేపథ్యంలోనూ, భారతీయ స్వాతంత్ర్య పోరాటాల ఫలంగానూ దేశానికి 1947 ఆగస్టు 14న అర్థరాత్రి సమయంలో స్వాతంత్ర్యం వచ్చింది.

బ్రిటీష్ ఇండియా ఆఖరు గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ 1948లో నిర్ణీతమైన స్వాతంత్ర్య దినాన్ని ముందుకు జరుపుతూ 1947 ఆగస్టు 15న జరగాలని నిర్ణయించారు. రెండవ ప్రపంచయుద్ధం జపాన్ లొంగుబాటుతో ముగిసిపోయిన రోజు ఆగస్టు 15 కావడంతో భారత స్వాతంత్ర్యానికి దానిని ఎంచుకున్నారు బాటన్.

భారత స్వాతంత్య్ర దినోత్సవం, మువ్వన్నెల జెండా గురించి ప్రతి ఒక్కరూ తెలుకోవాల్సిన ముఖ్య విషయాలు, జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య బయోగ్రఫీ మీకోసం

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు (75th Independence Day) ప్రతి సంవత్సరం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద వైభవోపేతంగా జరుగుతాయి. మొదటి స్వాతంత్ర్య దినోత్సవం నాడు రాత్రి సమయంలో నెహ్రూ మాట్లాడిన మాటలను ఓ సారి పరిశీలిస్తే..అనేక సంవత్సరాల క్రితమే మన భవితవ్యం గురించిన గమ్యస్థానాన్ని చేరుకొని తీరాలని మనం నిర్ణయించాం. మన ఈ నిర్ణయాన్ని పూర్తిగా, కూలంకషంగా సాధించే సమయం యిప్పుడు ఆసన్నమయింది. అర్థరాత్రి పన్నెండు గంటలు కొట్టగానే, ప్రపంచమంతా నిద్రాదేవి ఒడిలో పారవశ్యం చెందివున్న సమయాన, భారతదేశం, పునరుజ్జీవనంతో, స్వేచ్ఛగా స్వతంత్రదేశంగా ఆవిర్భవిస్తుంది.

ఆగ‌స్టు 14వ తేదీ ఇకనుంచి విభజన గాయాల స్మారక దినం, భయానక విభజన గాయాలు గుర్తు చేసుకునే రోజుగా ఈ తేదీని జరుపుకోవాలని ట్విట్టర్ ద్వారా తెలిపిన ప్రధాని నరేంద్రమోదీ

ఈ సందర్భంగా, భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవg 2021 పురస్కరించుకుని గూగుల్ ఒక ప్రత్యేక డూడుల్‌తో (Google Celebrates India's 75th Independence Day) ముందుకు వచ్చింది. ఈ డూడుల్ దేశంలో సంపన్నమైన సంస్కృతి సంప్రదాయాలను కలిగి ఉంది. గూగుల్ డూడుల్ వివిధ రకాల నృత్య రూపాలను పొందుపరిచింది. గూగుల్ 2003 నుండి గూగుల్ డూడుల్‌తో ముందుకు వచ్చింది మరియు అప్పుడు 'ఓ' అనే పదానికి బదులుగా అశోక్ చక్ర మరియు యానిమేటెడ్ పద్ధతిలో 'L' అక్షరంతో భారత జాతీయ జెండా రెపరెపలాడే విధంగా రూపొందించింది.

భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు,ఈ కోట్స్‌తో మీ బంధుమిత్రులకి, స్నేహితులకి విషెస్ చెప్పండి, WhatsApp Status, Quotes, Facebook Captions మీకోసం..

నేటి డూడుల్‌లో టూటారి, షెహనాయ్, ధోల్, వీణ, సారంగి మరియు బాన్సూరి వంటి అనేక భారతీయ జానపద వాయిద్యాలను కలిగి ఉన్న కళాకృతులు ఉన్నాయి. "బహుముఖ డబుల్ రీడ్ షెహనాయ్ నుండి ప్రతిధ్వనించే స్ట్రింగ్డ్ సారంగి వరకు, ఈ వాయిద్యాలు కొన్ని భారతదేశంలోని గొప్ప సంగీత వారసత్వాన్ని తయారు చేస్తాయి, ఇవి 6,000 సంవత్సరాల క్రితం నాటివి ... ఈ ప్రత్యేకమైన సేకరణ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగీత వైవిధ్యం భారతీయ ప్యాచ్‌వర్క్‌ను ప్రతిబింబిస్తుంది. ఈ రోజు దేశవ్యాప్తంగా జరుపుకునే సంస్కృతులు, ”అని గూగుల్ ప్రకటించింది.