Sudigali Sudheer: యాంకర్ రష్మీకి కన్నీళ్లు పెట్టిస్తున్న సుడిగాలి సుధీర్, కొత్త యాంకర్ తో కలిసి ఆ పనిచేస్తూ అడ్డంగా దొరికిపోయాడుగా...
(Photo-Video Grab)

బుల్లి తెర పవర్ స్టార్  సుడిగాలి సుధీర్‌ చేస్తున్న పనులు చూస్తుంటే అందరిని షాక్ కు గురి చేస్తోంది. గతంలో కెమిస్ట్రీ కలిపిన యాంకర్ రష్మిని దూరం పెట్టిన సుడిగాలి సుధీర్‌, ఇప్పుడు మరో నటితో చెట్టాపట్టాలేసుకుని తిరుగడం హాట్‌ టాపిక్‌ గా మారుతుంది. ప్రస్తుతం సుధీర్‌ `ఢీ` యాంకర్‌ దీపికా పిల్లి తో కలిసి తిరుగుతున్నారు. ఈ ఇద్దరు ఇటీవల తరచూ కలిసే వెళ్తుండటం విశేషం. అయితే ఇదంతా వారిద్దరు కలిసి నటించిన సినిమా కోసం అనేది అందరికి తెలిసిందే.

సుడిగాలి సుధీర్‌, దీపికా పిల్లి కలిసి జంటగా `వాంటెడ్‌ పండుగాడ్‌` అనే చిత్రంలో నటించారు. అనసూయ, విష్ణు ప్రియ, సునీల్‌ వంటి కమెడియన్లు కలిసి నటించిన ఈ సినిమాకు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో రూపొందిన ఈ సినిమా ఆగస్ట్ 19న విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా సుడిగాలి సుధీర్‌, దీపికా పిల్లి ప్రధానంగా చిత్ర ప్రమోషన్‌లో పాల్గొంటున్నారు. ఎక్కడ చూసినా వీరిద్దరే కనిపిస్తున్నారు.

దీంతో నెటిజన్లు సోషల్‌ మీడియాలో రెచ్చిపోతున్నారు. రష్మిని వదిలేసిన సుడిగాలి సుధీర్‌, దీపికా పిల్లితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. మరి రష్మి పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. దీనిపై లేనిపోని రచ్చ చేస్తుండటం గమనార్హం.

వైరల్ వీడియో.. డాక్టర్ ఎదురుగా గుండె పోటుతో కుప్పకూలిన పేషెంట్, పరుగున వచ్చి రోగి ఛాతిపై సీపీఆర్‌ చేసి బతికించిన డాక్టర్

ఇటీవల జబర్దస్త్ ని వీడిన సుధీర్‌, స్టార్‌ మాలో  సూపర్‌ సింగర్‌ జూనియర్స్ షోకి హోస్ట్ గా ఉన్నాడు. అనసూయతో కలిసి రచ్చ చేస్తున్నాడు. మరోవైపు హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. `వాంటెడ్‌ పండుగాడ్‌`తోపాటు `గాలోడు`, కాలింగ్‌ సహస్ర లాంటి చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలకు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

సుడిగాలి సుధీర్‌, యాంకర్‌ రష్మి గౌతమ్‌ లవ్‌ స్టోరీ కొన్నేళ్లుగా హాట్‌ టాపిక్‌. జబర్దస్త్ లో వీరిద్దరి కెమిస్ట్రీ పీక్‌లోకి ఉండేది. ఈ ఇద్దరు కలిసి డ్యూయెట్లు పాడితే షో టీఆర్‌పీ ఆమాంతం పెరిగిపోయేది. వీరి మధ్య వచ్చే సన్నివేశాలు, లవ్‌ ప్రపోజల్స్, రొమాంటిక్‌ పాటలు ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇద్దరు తమ బాండ్‌ చాలా స్పెషల్‌ అని చెప్పుకుంటూ వచ్చారు.

అయితే ఉన్నట్టుంది ఇటీవల వీరి మధ్య గ్యాప్‌ వచ్చింది. ఇద్దరు కలిసి చేసిన `జబర్దస్త్` షో నుంచి, `ఢీ` నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. `జబర్దస్త్`తోనైనా మొన్నటి వరకు మెప్పించిన ఈ జంట ఇప్పుడు దాన్నుంచి కూడా దూరయ్యారు. `జబర్దస్త్` ని సుడిగాలిసుధీర్‌ వదిలేసిన విషయం తెలిసిందే. సినిమా అవకాశాల నేపథ్యంలో ఆయన ఈషో నుంచి తప్పుకున్నారు. దీంతో ఇద్దరు ఓ రకంగా విడిపోయిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఎక్కడ ఉన్నా మా మనసులు కలిసే ఉంటాయని రష్మి చెప్పడం హైలైట్‌గా నిలిచింది.