Swami Vivekananda Best Quotes in Telugu: ఇప్పటి వరకు ఎంతో ఏడ్చాం. ఇంకా ఏడ్చేందుకు ఏమీ మిగలలేదు. లే ! లేచి నీ కాళ్లపై నీవు ఒక మనిషిగా నిలబడు అంటూ వివేకానంద చెప్పిన సూక్తులు ఎంతోమందిని స్థైర్యాన్ని నింపాయి. నిరంతరం శ్రమిస్తూ అంతులేని ఆత్మస్థైర్యం, ఓరిమి కలిగి ఉన్న సామాన్య ప్రజలే ఈ దేశానికి వెన్నెముక. తనకు జైజైకారాలు పలుకుతున్నప్పుడు, తనకు గొప్పవాడుగా గుర్తింపు లభిస్తున్నపుడు పిరికివాడు కూడా ప్రాణత్యాగానికి వెనుకాడడు. తన గొప్పతనానికి మూలాధారమైన నైతిక విలువలు పాటిస్తూ అత్యంత శక్తి సామర్ధ్యాలు కలిగిన క్రిందిస్ధాయి ప్రజలలోనే భారతజాతి జీవించి ఉన్నది. వారితోనే మళ్ళీ ఈ జాతి విశ్వగురుత్వ స్థానానికి ఎదుగుతుంది. ఆ గుడిసె వాసుల నుండే జాతి జాగృతమవుతుందని స్వామి వివేకానంద చెప్పిన జీవిత సత్యాలు నేటికి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. స్వామి వివేకానంద చెప్పిన కోట్స్ గురించి ఓ సారి తప్పక తెలుసుకోండి
ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.
దేవునిపై నమ్మకం లేనివాడు కాదు, ఆత్మవిశ్వాసం లేనివాడే నా దృష్టిలో నాస్తికుడు.
సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు.
నిరంతరం వెలిగే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుంది. నిరంతరం శ్రమించేవాణ్ని చూసి ఓటమి భయపడుతుంది.
అసత్యం కన్నా సత్యం అనంత రెట్లు బరువైనది,మంచితనం కూడా అంతే.
పిరికితనం మనిషిని నిర్వీర్యుడ్ని చేస్తుంది, ఆత్మవిశ్వాసం మనిషిని విజయపథం వైపు నడిపిస్తుంది.
గుడిసె వాసుల నుండే జాతి జాగృతమవుతుందని స్వామి వివేకానంద చెప్పిన జీవిత సత్యాలు నేటికి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.