
Swami Vivekananda Best Quotations in Telugu: నిరంతరం శ్రమిస్తూ అంతులేని ఆత్మస్థైర్యం, ఓరిమి కలిగి ఉన్న సామాన్య ప్రజలే ఈ దేశానికి వెన్నెముక. తనకు జైజైకారాలు పలుకుతున్నప్పుడు, తనకు గొప్పవాడుగా గుర్తింపు లభిస్తున్నపుడు పిరికివాడు కూడా ప్రాణత్యాగానికి వెనుకాడడు. తన గొప్పతనానికి మూలాధారమైన నైతిక విలువలు పాటిస్తూ అత్యంత శక్తి సామర్ధ్యాలు కలిగిన క్రిందిస్ధాయి ప్రజలలోనే భారతజాతి జీవించి ఉన్నది. వారితోనే మళ్ళీ ఈ జాతి విశ్వగురుత్వ స్థానానికి ఎదుగుతుంది.
ఆ గుడిసె వాసుల నుండే జాతి జాగృతమవుతుందని స్వామి వివేకానంద చెప్పిన జీవిత సత్యాలు నేటికి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇప్పటి వరకు ఎంతో ఏడ్చాం. ఇంకా ఏడ్చేందుకు ఏమీ మిగలలేదు. లే ! లేచి నీ కాళ్లపై నీవు ఒక మనిషిగా నిలబడు అంటూ వివేకానంద చెప్పిన సూక్తులు ఎంతోమందిని స్థైర్యాన్ని నింపాయి. స్వామి వివేకానంద చెప్పిన కోట్స్ గురించి ఓ సారి తప్పక తెలుసుకోండి.
ఏ పరిస్థితులలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగాల్సిన పనులు వాతంట అవే జరుగుతాయి.

ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం, ఇది విజయాన్ని కాంక్షించే వారి ప్రాథమిక లక్షణాలు.

తనను తాను చిన్నబుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనలకంటే పెద్ద బలహీనత.

.మందలో ఒకరిగా ఉండకు. వందలో ఒకరిగా ఉండడానికి ప్రయత్నించు.

ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు.

కెరటం నాకు ఆదర్శం .. లేచి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు.

లే ! లేచి నీ కాళ్లపై నీవు ఒక మనిషిగా నిలబడు అంటూ వివేకానంద చెప్పిన సూక్తులు ఎంతోమందిని స్థైర్యాన్ని నింపాయి.