
Latest Ugadi Wishes in Telugu: తెలుగు వారి పండుగలు అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. వాటిలో ఉగాది పండుగ ఎంతో గొప్ప పండుగ. ఉగాది పండుగ రోజున మనం షడ్రుచుల పచ్చడిని తింటాం. తీపి, పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారం వంటివి మన జీవితంలో కష్టాలు, సుఖాలు, ఆనందాలు, బాధలు అన్నింటికీ పచ్చడీ ప్రతీక అని చెప్పవచ్చు. ఉగాది పేరులోనే యుగ ఆది అనే అర్థం ఉంది. అనగా ఈ ఏడాది ప్రారంభమని.. మన తెలుగు వారికి ఉగాదితోనే సంవత్సరం ప్రారంభమవుతుంది.
షడ్రుచుల సమ్మేళనం - తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది.మీ కోసం ఉగాది శుభాకాంక్షలు తెలిపే విషెస్, కోట్స్...

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఈ మెసేజెస్ ద్వారా శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు చెప్పేయండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఈ మెసేజెస్ ద్వారా శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు చెప్పేయండి

ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు. ఈరోజున పంచాంగ శ్రవణం చేయడం కూడా ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది ఎవరి భవిష్యత్ ఎలా ఉందో తెలుసుకోవడానికి పంచాంగం వినిపిస్తారు. ఈ సంవత్సరాన్ని శోభకృత్ నామ సంవత్సరంగా పిలుస్తున్నారు