
Latest Ugadi Quotes in Telugu: తెలుగు వారి పండుగలు అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. వాటిలో ఉగాది పండుగ ఎంతో గొప్ప పండుగ. ఉగాది పండుగ రోజున మనం షడ్రుచుల పచ్చడిని తింటాం. తీపి, పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారం వంటివి మన జీవితంలో కష్టాలు, సుఖాలు, ఆనందాలు, బాధలు అన్నింటికీ పచ్చడీ ప్రతీక అని చెప్పవచ్చు. ఉగాది పేరులోనే యుగ ఆది అనే అర్థం ఉంది. అనగా ఈ ఏడాది ప్రారంభమని.. మన తెలుగు వారికి ఉగాదితోనే సంవత్సరం ప్రారంభమవుతుంది.
షడ్రుచుల సమ్మేళనం - తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది.మీ కోసం ఉగాది శుభాకాంక్షలు తెలిపే విషెస్, కోట్స్

తీపిలోని ఆనందం, చేదులోని దుఖం, కారంలోని అసహనం
పులుపులోని ఆశ్చర్యం, ఉప్పులోని ఉత్సాహం, వగరులోని పొగరు- సాహసం.
అన్ని రుచులను స్వీకరించినపుడే జీవితానికి ఒక అర్థం.
ఏదేమైనా ముందడుగు వేయమని చెప్పేదే ఉగాది పర్వదినం
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు

గుమ్మానికి లేత మామిడి తోరణాలు
గడపకు స్వచ్ఛమైన పసుపు పూతలు
వాకిళ్లకు అలుకుతో పలికే స్వాగతాలు
ప్రకృతి వరప్రసాద షడ్రుచుల స్వీకారాలు
మన సాంప్రదాయాలే తొలగిస్తాయి సమస్త చీడపీడల రోగాలు.
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు 'లేటెస్ట్‌లీ తెలుగు' తరఫున శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

చైత్రమాసాన వసంత ఋతువులో కొత్త పూతలతో, కోయిల రాగాలతో ప్రకృతి సోయగాల నడుమ వచ్చే ఉగాది పడంగ ఎంతో ఆహ్లాదాన్ని పంచుతూ మనస్సులో కొత్త ఉత్సాహాన్ని, కొత్త ఆలోచనలను నింపుతుంది.