Tokyo, May 11: లవ్ మ్యారేజీ (Love Marriage).. అరెంజ్డ్ మ్యారేజీని ఇప్పటివరకూ చూశాం. అయితే, కొత్తగా ఫ్రెండ్ షిప్ మ్యారేజీ (Friendship Marriage) కూడా తెరపైకి వచ్చింది. జపాన్ లో ఇప్పుడు పెద్దయెత్తున నడుస్తున్న కొత్త ట్రెండ్ ఇది. మూడు పదులు దాటిన పెండ్లి కావడం కష్టమవుతున్న జపాన్ యువత.. ఈ కొత్త ట్రెండ్ పట్ల ఆసక్తి చూపుతున్నది. 12 కోట్లకు పైగా జనాభా ఉన్న జపాన్ లో ఇలాంటి వారు 12 లక్షల మంది వరకు ఉన్నారు.
All about #Japan's innovative 'Friendship Marriage' trend, where couples prioritise companionship over physical intimacyhttps://t.co/3hkz55nW1b
— News9 (@News9Tweets) May 10, 2024
ఏమిటీ ఫ్రెండ్ షిప్ మ్యారేజీ?
ప్రేమ, శృంగారానికి దూరంగా ఉంటూ దంపతుల్లా కలిసి జీవించడమే ఫ్రెండ్ షిప్ మ్యారేజ్. చట్టపరంగా వీరు దంపతులైనప్పటికీ ఈ రెండింటికీ దూరంగా ఉంటారు. వీరు కలిసి జీవించవచ్చు. లేదా వేర్వేరుగా ఉండవచ్చు. పిల్లలు కావాలంటే కృత్రిమ గర్భధారణ పద్ధతులు పాటిస్తారు. లేకపోతే పెంచుకుంటారు. పరస్పర అంగీకారం ఉన్నంత కాలం ఇద్దరూ తమకు నచ్చిన వారితో స్వేచ్ఛగా ఉండవచ్చు. వివాహం చేసుకున్న వారికి ప్రభుత్వం అందించే అన్ని ప్రయోజనాలు వీరికి కూడా వర్తిస్తాయి.