Representative Image (Photo Credits: IStock.com)

అందంగా ఉండాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు ఇది ఈ కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం ఎంత ముఖ్యమో మెరిసే చర్మం పొందడానికి కూడా మన ఆ విధంగానే ఆహారంలో కొన్ని ప్రత్యేక శ్రద్ధలు తీసుకోవాలి. కేవలం పైపై రాసే కాస్మెటిక్సే కాకుండా మనం తీసుకునే ఆహారం మన చర్మం పైన ప్రభావాన్ని చూపిస్తుంది. కాస్మెటిక్స్ వాడడం కేవలం తాత్కాలిక రిజల్ట్ మాత్రమే ఇస్తుంది. అలా కాకుండా మన ఆహారంలో మార్పులు చేసుకొని విటమిన్ ను, ప్రోటీన్, ఫైబర్ కంటెంట్, వాటర్ కంటెంట్, ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే మీ చర్మం మెరుపును సంతరించుకుంటుంది. సహజంగా మన చర్మ ఆరోగ్యాన్ని పెంచుకునేందుకు కొన్ని ఆహార పదార్థాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.

విటమిన్ సి: విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచడానికి మాత్రమే కాకుండా మన చర్మం నిగారింపుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ సీజనల్ లో వచ్చే నిమ్మ, దానిమ్మ, ద్రాక్ష, కివి వంటి విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మన చర్మం పైన ముడతలు తగ్గిపోయి మన చర్మం ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. పెరిగి మన చర్మం ముడతలు పడకుండా వృద్ధాప్య ఛాయలు రాకుండా ఈ కొల్లాజిన్ సహాయపడుతుంది. కాబట్టి విటమిన్ సి తీసుకోవడం మన చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది.

ప్రోటీన్: మన చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రోటీన్ కూడా ఒక ముఖ్య పాత్రను పోషిస్తుంది. ముఖ్యంగా ప్రోటీన్ అధికంగా ఉన్న చికెన్, సోయాబీన్స్ ,డ్రై ఫ్రూట్స్ ,ఎగ్స్ పన్నీర్ ,వంటి ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా మన చర్మం ఎప్పుడు కూడా తాజాగా ఉంటుంది. మన చర్మం ఉన్న ముడతలు తగ్గడానికి లోపల ఉన్న మృత కణాలు తొలగిపోవడానికి ప్రోటీన్ అనేది చాలా అవసరం. మన ఆహారంలో ప్రోటీన్ అధికంగా చేర్చుకుంటే చర్మ సమస్యలు కూడా తగ్గిపోయి చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.

Health Tips: మధ్యాహ్నం అరగంట నిద్రతో ఎన్ని లాభాలు తెలుసా.

నీరు: చర్మాని ఎప్పుడు హైడ్రేట్ గా ఉంచడం చాలా ముఖ్యం. దీనికోసం మనం ప్రతి రోజు 8 నుండి 10 గ్లాసుల నీరు తీసుకోవాలి. దీని ద్వారా మన చర్మం ఎప్పుడు కూడా తేమగా ఉంటుంది. మృదువుగా ఉంటుంది మొటిమలు మచ్చలు తగ్గిపోతాయి. నీటిని తీసుకోవడం ద్వారా మన శరీరంలో లోపలం ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటికి పోయి మన శరీరం మన చర్మం మెరుపును సంతరించుకుంటుంది. ప్రతిరోజు ఇలా చేసినట్లయితే ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా కాపాడుకోవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.