ఈ వర్షాకాలంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల తరచూ జలుబు జ్వరం వంటి సమస్యలు పెరుగుతాయి. దీని ద్వారా ఒక్కోసారి గొంతు నొప్పి, నీరసంగా అనిపించడం కూడా ఉంటుంది. అంతేకాకుండా కండరాల నొప్పులు కూడా ఇబ్బంది పెడుతుంటాయి. ఇటువంటి సమస్యల నుంచి బయటపడడానికి మన ఆయుర్వేదంలో చాలా మొక్కలు ఉన్నాయి. ఇవి మన శరీరంలో ఇమ్యూనిటీ పెంచడానికి ఉపయోగపడతాయి ఆ మొక్కలు ఏంటో వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
తులసి: తులసి మన అందరి ఇళ్లల్లో ఉంటుంది. దీనిలో ఉండే యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీబరిక్టీరియల్ లక్షణాలు జలుబు దగ్గు ఇన్ఫెక్షన్స్ వంటి వాటితోటి పోరాడుతాయి. తులసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది వైరల్ జరాలకు కారణమయ్యే వైరస్ బ్యాక్టీరియాలను తొలగించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. తులసి ఆకులు తీసుకొని నీటిలో మరిగించి ప్రతిరోజు రెండు సార్లు తీసుకున్నట్లయితే మీకు వర్షాకాలంలో వచ్చే జలుబు జ్వరాలు తొందరగా తగ్గిపోతాయి.
Health Tips: చలికాలంలో కూడా పెరుగన్నం తినడం ఆరోగ్యానికి మంచిదేనా ...
తిప్పతీగ: ఆయుర్వేదంలో తిప్పతీగకు అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉంది. ఈ మొక్క ఆకులు, వేర్లు,, కాండం అన్నీ కూడా ఉపయోగపడతాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేశ్వరి ,యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉండటం వల్ల జ్వరము, కామెర్లు ఎసిడిటీ, దగ్గు ,వంటి లక్షణాలు అన్నిటిని కూడా తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. తిప్పతీగ జ్యూస్ మార్కెట్లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా మాత్రలు కూడా ఉన్నాయి. ప్రతిరోజు రెండు నుంచి మూడు చెంచాల తిప్పతీగ జ్యూస్ ని ఒక గ్లాసు నీటిలో కలుపుకొని ఖాళీ కడుపుతో తాగాలి. ఇలా తాగినట్లయితే మీ ఇమ్యూనిటీ పెరిగి జబ్బుల నుండి దూరంగా ఉండవచ్చు.
అశ్వగంధ: అశ్వగంధ ను ఔషధ గని అంటారు. ఇది ఇమ్యూనిటీ పెంచడంలో ప్రముఖ స్థానంలో ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్ లను జలుబు జ్వరాలను తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మానసిక సమస్యలను తగ్గించడానికి, నిద్రలేమి సమస్య కూడా ఇది చక్కటి ఔషధం. అశ్వగంధ పొడి మనకు మార్కెట్లో లభిస్తుంది. అర టీ స్పూన్ అశ్వగంధ ను గోరువెచ్చటి నీళ్లలో వేసుకొని ప్రతిరోజు తీసుకున్నట్లయితే మీకు ఇమ్యూనిటీ అనేది పెరిగి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు.
అతిమధురం: దీన్నే లికోరైస్ అంటారు. ఈ అతి మధురం పొడి అనేది అన్ని మార్కెట్లో లభిస్తుంది. ఇది యాంటీ వైరల్ ,ఇన్ఫర్మేషన్ ,యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు కలిగి ఉంది. కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచి మీ శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ తో పోరాటంలో సహాయపడుతుంది. ఇది ఎలర్జీలను తగ్గిస్తుంది. మీ జీర్ణ క్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీని పొడిని రెండు నుంచి మూడు గ్రాముల వరకు తీసుకొని మరిగించుకొని టీ లాగా తాగవచ్చు. ఇలా రెగ్యులర్ గా కనుక తీసుకున్నట్లయితే మీ ఇమ్యూనిటీ అని పెరిగి జబ్బులు రాకుండా చేస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.