బాదం ఆరోగ్యానికే కాదు అందానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అందంగా ఉండాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్లకు ఈ కోరిక కాసంత ఎక్కువగానే ఉంటుంది. బాదం నూనెతో చర్మానికి చాలా ఉపయోగాలు కలుగుతాయి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు బాదం నూనెను మొహం పైన మసాజ్ చేసుకుంటే అనేక చర్మ సమస్యల నుండి బయటపడి చర్మం మచ్చలు ముడతలు లేని చంద్రబింబం లాంటి ముఖం మీ సొంతమవుతుంది.
చర్మానికి బాదం నూనె: బాదం నూనెలో విటమిన్ ఏ డి ఈ కాల్షియం, పొటాషియం, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఈ లక్షణాలు. అన్ని కూడా మన చర్మాన్ని ఎప్పుడు తేమగా ఉంచి మొహం పైన మచ్చలు మొటిమలు రాకుండా చర్మాన్ని మెరిసే విధంగా చేస్తుంది.
ఉపయోగించే విధానం: బాదం నూనెను మొహానికి రెండు పద్ధతుల ద్వారా ఉపయోగించవచ్చు.
మొదటిది- మీరు రాసుకునే ఏదైనా క్రీం లో ఈ బాదం నూనెను మిక్స్ చేసి రాత్రి పడుకునే ముందు మొహాన్ని శుభ్రంగా కడుక్కొని మొహం పైన ఈ బాదం నూనె రాసుకున్నట్లయితే మీ చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.
Health Tips: మీ పిల్లలకు టాల్కం పౌడర్ అతిగా వాడుతున్నారా
రెండవ పద్ధతి- రాత్రిపూట పడుకునే ముందు బాదం నూనెను మీ మొహం పైన పది నిమిషాల పాటు మసాజ్ చేయండి. అంతేకాకుండా 10 నిమిషాల పాటు ఆవిరి పెట్టి మళ్ళీ పదినిమిషాల పాటు మసాజ్ చేసుకున్నట్లయితే మీ చర్మం పైన ఉన్న మృత కణాలన్నీ తొలగిపోయి చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.
ప్రయోజనాలు: బాదం నూనెను ప్రతిరోజు చర్మం పైన రాసుకున్నట్లయితే వృద్ధాప్య ఛాయలు తగ్గిపోయి ముడతలను తగ్గిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ E మన చర్మాన్ని మరింత మృదువుగా ఉంచి కొల్లాజిన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని ద్వారా ముడతలు తగ్గిపోతాయి.
అందాన్ని పెంచడంలో బాదం లోనే ప్రభావంతంగా పనిచేస్తుంది ఇది సహజమైన మాయిశ్చరైజర్ గా పనిచేసి మన చర్మాన్ని పొడిబారకుండా ఎప్పుడు కూడా తేమగా ఉంచుతుంది. దీని ద్వారా మనకు ఎప్పుడు కూడా హైడ్రేటెడ్ గా ఉండి చర్మం నిగరింపును సంతరించుకుంటుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.