నాన్ వెజ్ ఇష్టపడని వారు ఎవరుంటారు. చాలామందికి చికెన్, మటన్ వంటివి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, ప్రతిరోజు నాన్ వెజ్ తీసుకుంటారు, అయితే ఇది ప్రోటీన్ ని, ఐరన్ ను విటమిన్స్ ను అందిస్తుంది. కానీ ప్రతిరోజు తీసుకోవడం వల్ల అనేక రకాలైన జబ్బులు వచ్చే అవకాశాలు ఏర్పడతాయి. ముఖ్యంగా గుండె జబ్బులు షుగర్ వ్యాధి వంటి వ్యాధులు వస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం ప్రతిరోజు మాంసాహారం తీసుకునే వారిలో అనేక రకాలైనవ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అధికంగా తీసుకోవడం వల్ల వీరిలో కొవ్వు శాతం పెరిగిపోయి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఇది అరగడానికి ఎక్కువ టైం పడుతుండడం వల్ల దీని వల్ల కడుపు కాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలో తేలింది.
ప్రతిరోజు ప్రాసెస్ చేసిన మాంసాహారాన్ని తీసుకోవడం ద్వారా మన శరీరానికి తీవ్రహాన్ని కలుగుతుంది.
గుండె జబ్బులు: ముఖ్యంగా ఎక్కువ మాంసాహారం తీసుకునే వారిలో గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది వీరిలో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా అయిపోయి హాట్ లో బ్లాక్ లో ఏర్పడతాయి దీని ద్వారా గుండెపోటు వచ్చే ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
షుగర్ వ్యాధి: ప్రతిరోజు మాంసాహారం తీసుకోవడం ద్వారా వీరి రక్తంలో చక్కెర స్థాయిలో పెరిగిపోయి గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది పెరిగిపోయి షుగర్ వ్యాధికి దారితీస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మాంసాహారాన్ని ఎవాయిడ్ చేయడమే ఉత్తమం.
Health Tips: కడుపుబ్బరంతో బాధపడుతున్నారా
గ్యాస్ ప్రాబ్లమ్స్: ఎక్కువగా నాన్ వెజ్ తినే వారిలో అల్సర్, డ్యూడినేటస్ అల్సర్,, గాల్బ్లాడర్ డిసీజెస్, రిఫ్లెక్స్ వ్యాధి వంటివి ఏర్పడి కడుపు సమస్యలను ఇబ్బంది పెడుతుంది. దీన్ని తీసుకోవడం ద్వారా సరిగ్గా జీర్ణం అవ్వక కడుపు నొప్పి కడుపుబ్బరం వంటి సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి దీన్ని సాధ్యమైనంత వరకు తగ్గిస్తే ఈ జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి.
నిమోనియా: మాంసాహారం అధికంగా తీసుకునే వారిలో నిమోనియా వ్యాధి కూడా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. విచక్షణ రహితంగా మాంసం తీసుకోవడం ద్వారా మీకు అనేక రకాలైన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అధిక బరువు వల్ల అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి.
కొలెస్ట్రాల్: ప్రతిరోజు మాంసాహారం తీసుకోవడం ద్వారా మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ట్రై లిసరేట్స్ కూడా పెరిగి గుండె జబ్బులకు దారితీస్తుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ పెరగడం ద్వారా మీ రక్త సరఫరా మందగిస్తుంది. దీని ద్వారా బిపి ఏర్పడుతుంది. బీపీ వల్ల మీకు బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదకర పరిస్థితి ఎదుర్కొంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు నాన్ వెజ్ ను తగ్గించి పోషకాహారాల్లో అయిన తాజా కూరగాయలు తాజా పండ్లను వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి పండ్లను తీసుకున్నట్లయితే మీకు ఉత్తమం.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.