క్యాల్షియం మన శరీరానికి ఎంతో కావాల్సిన ముఖ్యమైనది. ఈ క్యాల్షియం లోపం వల్ల మనకు శరీర ఎదుగుదల ఉండదు. దీనివల్ల క్యాల్షియం లోపం వల్ల కండరాల దృఢంగా ఉండవు, ఎముకలు బలోపేతంగా ఉండవు. అనేక రకాలైనటువంటి కీళ్ల నొప్పులు వంటివి వస్తాయి. క్యాల్షియం లోపం వల్ల ఇదంతాలు ఊడిపోతూ ఉంటాయి. చర్మం పులుసు వారితో ఉంటుంది. నీరసం నిస్సత్వ ఆందోళన అధికంగా ఉంటుంది. ఈ క్యాల్షియం లో పని అధిగమించడానికి మన ఆహార పదార్థాల్లో ఈ రెండు చేర్చుకున్నట్లైతే కచ్చితంగా మీ కాల్షియం లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శనగలు: శనగలను నానబెట్టి ఉడకబెట్టుకొని తాలింపు వేసుకొని తింటూ ఉంటారు ఇది మన అందరికీ తెలిసిందే. కానీ దీనిలో ఉన్న పోషక విలువలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. శనిగల్లో అనేక రకాలైనటువంటి పోషకాలు ఉన్నాయి. దీనిలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. క్యాల్షియం అధికంగా ఉంటుంది. మాంసాహారంతో పోలిస్తే అధికంగా కూడా ఇందులో కాల్షియం,ప్రోటీన్ అధికంగా ఉంటాయి. ఇది శాఖాహారులకు ఒక అద్భుత వరమనే చెప్పవచ్చు. శనగల లో ఉండే అనేక రకాలైనటువంటి పోషక విలాలు మన ఆరోగ్యానికి దోహదపడతాయి. అనేక రకాలైనటువంటి జబ్బులు తగ్గించడంలో ఈ శనగలు ఉపయోగపడతాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మన జీర్ణ వ్యవస్థకు మంచిది. అంతేకాకుండా ఇందులో క్యాల్షియం అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది మన కండరాలకు ఎముకలకు దంతాలకు చాలా బలాన్ని చేకూరుస్తుంది. ఇందులో ఐరన్ కంటెంట్ ,జింక్ కంటెంట్ అధికంగా ఉండడం వల్ల మనము రక్తహీనత సమస్య నుంచి కూడా బయటపడతాము. ముఖ్యంగా ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. శాకాహారులు దీన్ని మీరు రెగ్యులర్ గా తీసుకున్నట్లయితే మాంసాహారం తీసుకున్న వారి కంటే కూడా రెట్టింపు మీకు అందుతుంది.
Health Tips: భోజనం తర్వాత పది నిమిషాలు నడకతో మీ షుగర్ కంట్రోల్ ...
మునగాకు: మునగాకు కాల్షియం అధికంగా ఉండే మరొక ఆహార పదార్ధం. ఈ మునగాకులో పాల కంటే అధిక రెట్లు క్యాల్షియం ఉంటుంది. ఈ మునగాకుని మీరు ఆహారంలో బాధలు చేసుకున్నట్లయితే కాల్షియం లోపం తగ్గుతుంది. పాలిచ్చే తల్లులకు ఇదొక అద్భుత వరమనే చెప్పవచ్చు ఎందుకంటే వారిలో క్యాల్షియం లోపం అధికంగా ఉంటుంది. కనుక ఇది మీరు బాలింత సమయంలో తీసుకున్నట్లయితే మీకు కాల్షియం లోపం ఉండదు. పాలు అధికంగా పడతాయి.ఇందులో ఐరన్, జింక్ ఫాస్ఫరస్ ,మెగ్నీషియం వంటి అనేక రకాలైనటువంటి మూలకాలు ఉన్నాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచి అనేక రకాలైనటువంటి ఇన్ఫెక్షన్ల బారి నుండి బయట పడవేస్తాయి. కాబట్టి మునగాకుని మీరు పొడి రూపంలో గానీ కోర రూపంలో గానీ తీసుకున్నట్లయితే మీకు కాల్షియం అనేది అధికంగా లభిస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.