ఈ రోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య మధుమేహం. ఒకప్పుడు మధుమేహం కేవలం 50 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వచ్చే ఒక దీర్ఘకాలిక సమస్య కానీ ప్రస్తుత సమయంలో ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి 20 మందిలో ఇద్దరినీ ఇబ్బంది పెట్టే సమస్య.
ఈ మధుమేహం సైలెంట్ కిల్లర్ గా ఉంటుంది. ఇది మన శరీరంలో ఉన్న అవయవాలు అన్నిటిని కూడా అనారోగ్యానికి గురిచేస్తుంది. దీనివల్ల హార్ట్ ప్రాబ్లం, కాళ్ల నొప్పులు అరికాళ్ళల్లో పుండ్లు, కిడ్నీ సమస్యలు, కంటి సమస్యలు, జీర్ణసంబంధ సమస్యలు అన్నీ కూడా వస్తాయి, దీన్ని నియంత్రించుకోవడానికి రకరకాలైన మందులు వాడుతూ ఉంటాం, దీంతో పాటు మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి, వ్యాయామం చేయాలి. నూనె పదార్థాలు తగ్గించాలి, స్వీట్స్ మానివేయాలి, మీరు ఎక్కువగా తీసుకోవాలి ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు కూడా తీసుకోవాలి యోగ మెడిటేషన్ వంటివి కూడా చేయాలి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను మానివేసి ప్రోటీన్ ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకోవాలి వైట్ రైస్ కు బదులుగా బ్రౌన్ రైస్ తీసుకుంటే మంచిది.
Health Tips: రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారా
వీటి ద్వారా మనము షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా భోజనం తర్వాత ఒక పది నిమిషాలు నడిస్తే మీ షుగర్ అనేది కంట్రోల్ లో ఉంటుంది. ముఖ్యంగా రాత్రిపూట భోజనం తర్వాత ఒక ఒక పది నిమిషాలు నడిస్తే బ్లడ్ షుగర్స్ తగ్గుతాయని డాక్టర్స్ తెలిపారు. అంతేకాకుండా రోజుల్లో ఏదో ఒక సమయంలో కనీసం 30 నిమిషాల నడక మీ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.