gas

చాలామందిలో మలబద్ధకం సమస్య ఇబ్బంది పెడుతుంది. దీని ద్వారా పొట్ట నొప్పి, కడుపులో అల్సర్, కడుపుబ్బరం, వంటి సమస్యతో ఇబ్బంది పడతారు. సహజమార్గాలలో పండ్లు తీసుకున్నట్లయితే ఇవి మీ జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి. ఆ  పండ్లు ఏంటో తెలుసుకుందాం.

జామ పండు: జామ పండు మన జీర్ణ క్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అదేవిధంగా మలబద్దక సమస్య నుంచి బయటపడేలా చేస్తుంది. ప్రతిరోజు గనుక ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి జామ పండు తీసుకున్నట్లయితే మీరు ఈ మలబద్ధకం సమస్య నుంచి బయటపడతారు. ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మీరు తీసుకున్న ఆహారము త్వరగా జీర్ణం అవ్వడానికి ఉపయోగపడుతుంది.

దానిమ్మ పండు: దానిమ్మ పండులో విటమిన్స్ ఐరన్ పుష్కలంగా ఉండి అనేక పోషకాలను కలిగి ఉంటుంది. దీనిలో ఫైబర్ ను పెంచే గుణం ఉంది. కాబట్టి మనం తీసుకున్న ఆహారాన్ని సక్రమంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. దానిమ్మ రసం తీసుకున్నట్లయితే మీకు రక్తహీనత సమస్య నుంచి కూడా బయటపడతారు. అదేవిధంగా కూడా సహాయపడుతుంది. క్రమం తప్పకుండా ప్రతిరోజు ఒక దానిమ్మ పండును తీసుకున్నట్లయితే మీరు మలబద్ధకం సమస్యను నుండి బయటపడే అవకాశం ఉంది.

Health Tips: గర్భిణీ స్త్రీలకు యోగా ఎంత మేలు చేస్తుందో తెలుసా ...

నేరేడు పళ్ళు: నేరేడు పళ్ళు మన జీర్ణ క్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా మలబద్దక సమస్య నుంచి కూడా ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. ప్రతిరోజు మీరు నేరేడు పండ్లు తీసుకున్నట్లయితే మీ మలబద్ద సమస్యకు చక్కటి పరస్కారంగా ఉంటుంది. దీంట్లో కూడా ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మీరు తీసుకున్న ఆహారాన్ని సక్రమంగా జీర్ణం చేస్తుంది.

ఆల్బుకారా పళ్ళు: వర్షాకాలంలో అధికంగా కనిపించేవి ఆల్బుకర పళ్ళు. ఈ ఆల్బుకర పల్లెలో విటమిన్ సి ,ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది మీ పొట్టను శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. ఇది కూడా ప్రతిరోజు తీసుకున్నట్లయితే మీరు మలబద్ధకం సమస్య నుంచి బయటపడతారు.

బత్తాయి పళ్ళు: బత్తాయి పళ్ళు లోవిటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా దీంట్లో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మీరు తీసుకున్న ఆహారాన్ని సక్రమంగా జీర్ణం చేస్తుంది. దీని ద్వారా మీకు మలబద్ధకం సమస్య నుండి బయటపడతారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.