ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది మధుమేహంతో బాధపడుతున్నారు. కొంతమందిలో ఇది వారసత్వంగా వచ్చిన చాలామందిలో మాత్రము జీవనశైలిలో మార్పుల కారణంగా ఈ మధుమేహం వస్తుంది. శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, రాత్రులు ఎక్కువగా మేలుకోని ఉద్యోగాలు చేసే వాళ్ళలో ఈ షుగర్ అనేది చాలా చిన్న ఏజ్ లోనే వస్తుంది.
సైలెంట్ కిల్లర్ గా పేరు పొందిన ఈ షుగర్ వ్యాధి మన శరీరంలోనే అవయవాలు అన్నిటిని నెమ్మది నెమ్మదిగా ఇబ్బందికి గురిచేస్తుంది. షుగర్ ప్రాబ్లం వల్ల కాళ్లలో ఇబ్బందులు ఎదుర్కొంటాయి. అదే విధంగా నెమ్మదిగా చూపు కూడా తగ్గిపోతుంది. గుండెకు కూడా ఇబ్బంది కలుగుతుంది. కిడ్నీ ప్రాబ్లంలు కూడా రావచ్చు. వీటన్నిటికీ పరిష్కారంగా మీరు మీ ఆహారంలో చేదు జిలకరను భాగం చేసుకుంటే మీ షుగర్ లెవెల్ అనేది కంట్రోల్ గా ఉంటుంది. షుగర్ ప్రాబ్లెమ్ ఉన్నవారు చేదు జీలకర్రతో మీ షుగర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు కేవలం ఒక చేదు జీలకర్రతోటే మీ షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.
Health Tips: నెల రోజులు వరి అన్నం తినడం మానేస్తే ఏమవుతుందో తెలుసా
తయారీ విధానం: మార్కెట్లో చేదు జీలకర్ర లభిస్తుంది. అని ఆయుర్వేదం షాపులలో కూడా లభిస్తుంది. ఈ చేదు జీలకర్రను కాస్త వేయించుకొని పొడి చేసుకొని ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. ప్రతిరోజు ఉదయం పరిగడుపున రెండు నుంచి మూడు గ్రాముల చేదు జీలకర్ర పొడిని గోరువెచ్చని నీటిలో వేసుకొని త్రాగాలి. ఇలా తాగినట్లయితే మీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది షుగర్ అధికంగా ఉన్నవారు రెండుపూటలా తాగవచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు 15 రోజుల తర్వాత మళ్లీ మీ షుగర్ లెవెల్స్ ని ఒకసారి చెక్ చేసుకోండి. కచ్చితంగా ఫలితం ఉంటుంది. దీనితోపాటు ప్రతిరోజు 45 నిమిషాల పాటు వ్యాయామం చేయండి. బయట దొరికే జంక్ ఫుడ్ లను మానేసి పౌష్టికాహారం తీసుకోండి. అధిక బరువు ఉన్నవారు తమ బరువును తగ్గించుకునే ప్రయత్నం చేసినట్లయితే కచ్చితంగా షుగర్ వ్యాధి నుండి బయటపడవచ్చు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.