gas

ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడే సమస్య గ్యాస్ట్రిక్ ట్రబుల్ దీనివల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.  అజీర్ణం వంటి సమస్యలు తీవ్ర ఇబ్బంది నీకు గురిచేస్తాయి.  దీనికి కారణాలు అధిక బరువు, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, శరీరానికి తగినంత శ్రమ చేయకపోవడం, వాటర్ తక్కువగా తీసుకోవడం, ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. మన జీవన శైలిలో మార్పు వల్ల పూర్తిగా తగ్గించుకోవచ్చు. మార్కెట్లో లభించే టాబ్లెట్స్  కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలుగుతుంది. అధికంగా ఈ గ్యాస్ట్రిక్ టబులు టాబ్లెట్స్ యూస్ చేయడం ద్వారా మీకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంది.కాబట్టి మన ఇంటిలో దొరికే పదార్థాలతోటి గ్యాస్ ప్రాబ్లం ని తగ్గించుకోవచ్చు. అదే విధంగా మన జీవనశైలిలో కొన్ని కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా కూడా మనము ఈ గ్యాస్ ప్రాబ్లం నుండి బయటపడవచ్చు.

గ్యాస్ట్రో ప్రాబ్లం ఉన్నవారు ఒకేసారి ఎక్కువగా తినకూడదు. కొంచెం కొంచెంగా రెండు మూడు సార్లు తినాలి. అది కూడా బాగా నమిలి తినాలి. దీని ద్వారా మీకు అజీర్ణ సమస్య ఉండదు. తీసుకున్న ఆహారం వెంటనే జీర్ణం అవుతుంది.

భోజనం చేసిన తర్వాత ఒక 45 నిమిషాల వరకు  వాటర్ తీసుకోకూడదు. ఎందుకంటే జీర్ణం అయ్యేటప్పుడు వాటర్ తీసుకోవడం ద్వారా ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఏదైనా తిన్న తర్వాత కనీసం ఒక 40 నిమిషాల తర్వాత వాటర్ తీసుకోవాలి.

Health Tips: కరివేపాకులో ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయో తేలుసా ...

తిన్న వెంటనే నిద్ర పోకూడదు దీనివల్ల జీర్ణ వ్యవస్థలో ఆటంకం కలుగుతుంది. కాబట్టి తిన్న తర్వాత నిద్రపోకూడదు. భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు.  దీని ద్వారా ఆహారం సరిగ్గా జీర్ణం కాక గ్యాస్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.

కాఫీ టీ లకు దూరంగా ఉండాలి. కాఫీ టీ ల వల్ల మన గ్యాస్ ప్రాబ్లం మరింతగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వాటికి బదులుగా మీరు మజ్జిగను ఎక్కువ మోతాదులో తీసుకుంటే మీకు ఈ గ్యాస్ ప్రాబ్లం నుండి బయటపడతారు.

కూల్ డ్రింక్స్ కూడా మానివేయాలి. దీంట్లో ఉన్న కార్బన్డయాక్సైడ్ గ్యాస్ ప్రాబ్లం ని అధికం చేస్తుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండే తాజా పండ్లను తీసుకున్నట్లయితే మీకు గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది.

అదేవిధంగా ధూమపానము, మద్యపానం అలవాటు ఉన్నవారు ఆ రెండిటిని కూడా మానుకోవాలి. ఇది కూడా గ్యాస్ ప్రాబ్లం పెంచుతుంది. కనుక ఈ అలవాట్లు మానుకుంటే మీకు గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది. ప్రతిరోజు రెండు నుంచి మూడు లీటర్ల వరకు నీటిని తాగాలి. ఇది కూడా మీ గ్యాస్టిక్ ట్రబుల్ సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా శరీరానికి కనీస వ్యాయామం 45 నిమిషాల పాటు చేయాలి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.