కిడ్నీ సమస్యతో బాధపడేవారు వారు తినే, తాగే అలవాట్లలో జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. మీరు తీసుకునే ఆహార పదార్థాలను మీ మూత్రపిండాలపైన ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా మీ ఆహారపు అలవాటులను మార్చుకోవడం ద్వారా ఈ కిడ్నీ సమస్యలతో బాధపడేవారు త్వరగా ఉపశమనాన్ని పొందవచ్చు. ఈరోజు కొన్ని ఆహార పదార్థాలను కిడ్నీకి ఉపయోగపడే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.
బెర్రీస్: బెర్రీస్ లో ముఖ్యంగా బ్లూ బెర్రీ, స్ట్రాబెరీస్, రాస్బెర్రీస్ వంటివి ఉంటాయి. ఇవి మూడిట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉండడం ద్వారా ఇది మన శరీరంలో ఉన్న మలినాలను బయటకు పంపించి కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. బెర్రీలలో పొటాషియం తక్కువగా ఉంటుంది. పొటాషియం తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు కిడ్నీ జబ్బుల వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఎక్కువ పొటాషియం ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా మూత్రపిండాలపైన ఒత్తిడి కలుగుతుంది. కాబట్టి ఈ బెర్రీలను మీరు డైరెక్ట్ గా గాని సలాడ్స్ లో కానీ స్మూతీల్లో కానీ కలుపుకొని తినొచ్చు.
ఆపిల్: ఆపిల్ లో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. అంటే కాకుండా ఇది జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది. ఇందులో ఉండే పెట్టిను మన జీర్ణ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్సు మన శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ను బయటికి పంపించడానికి సహాయపడుతుంది. దీని ద్వారా మూత్రపిండాలపైన ఒత్తిడి ఉండదు. ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం ద్వారా మీకు కిడ్నీలకు ఆరోగ్యం.
క్యారెట్: క్యారెట్ కూడా ఎంతో మూత్రపిండాలకు మంచిది ఇందులో ఉండే బీటా కెరోటిన్ మన శరీరానికి కావాల్సిన విటమిన్ ఏని అందిస్తుంది. అంతేకాకుండా మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్యారెట్ల పొటాషియం తక్కువగా ఉండటం ద్వారా ఇది మూత్రపిండాల పైన ఒత్తిడిని కలిగించదు. క్యారెట్ ని మీరు పచ్చిగా తీసుకోవచ్చు లేదా సలాడ్ రూపంలో సూప్ రూపంలో తీసుకున్నట్లయితే మీకుడ్నీలకు చాలా మంచిది.
Health Tips: మహిళల్లో వచ్చే గర్భాశయ వాపు సంకేతాలు ఏంటి
ఓట్స్: ఓట్స్ ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది మన జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది. మన శరీరంలో పేరుకుపోయిన హానిక రాయినటువంటి ఫ్రీ రాడికల్స్ ను బయటకు పంపించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో సోడియం, పొటాషియం తక్కువగా ఉంటాయి. కనుక మీరు ప్రతి రోజు మీ ఆహారంలో ఓట్స్ భాగం చేసుకున్నట్లయితే మీరు మూత్రపిండాల సమస్య నుండి బయటపడతారు.
వెల్లుల్లి: వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆహారానికి రుచి పెంచడమే కాకుండా అనేక పోషకాలను కలిగి ఉండి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే విటమిన్ సి, విటమిన్ b6 వంటివి మన రోగనిరోధక శక్తిని పెంచి మూత్రపిండాలకు చాలా ఉపయోగపడుతుంది, ఇందులో ఉండే పోషకాహారం వల్ల మన శరీరానికి మనం మూత్రపిండాలకు ఎంతో మేలు చేస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి