154 Stones in Kidney (PIC@ google)

చాలామంది కిడ్నీలో స్టోన్స్ సమస్యతో బాధపడుతుంటారు. తరచుగా అందరిలో కనిపించే సమస్య. కానీ ఈ సమస్య వచ్చినప్పుడు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. విపరీతమైన కడుపు నొప్పి, వాంటింగ్ సెన్సేషన్ తో బాధపడుతుంటారు. ఈ కిడ్నీలో స్టోన్స్ కొన్నిసార్లు ఇది ప్రాణాంతకం కావచ్చు. కాబట్టి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అని తెలిసిన వెంటనే కొన్ని ఆహార పదార్థాలను మన ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. మరి ఎక్కువైతే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి స్టార్టింగ్ స్టేజ్ లోనే వీటిని ఆహార పదార్థాలతో తగ్గించుకోవచ్చు. కిడ్నీలో స్టోన్స్ ఏర్పడడానికి ప్రధాన కారణము మూత్రంలో క్యాల్షియం, యూరిక్ యాసిడ్ వంటి రసాయనాలు స్పటిక రూపంలో మారడమే కిడ్నీ స్టోన్స్ అంటాము.

ఎలా ఏర్పడతాయి: కొంతమందిలో ఇది వంశపారంపర్యంగా రావచ్చు. మధుమేహం ఉన్న వారిలో ఇది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఎటువంటి వ్యాయామం లేకుండా అధిక బరువు ఉన్న వారిలో కూడా ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. నీరు తక్కువగా తీసుకునే వారిలో కూడా ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. జంక్ ఫుడ్ ఫైబర్ ఫుడ్ తక్కువగా తీసుకోవడం ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకోకపోవడం వల్ల కూడా ఈ కిడ్నీలో స్టోన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు క్యాల్షియము ,సాల్ట్ తక్కువగా తీసుకోవాలి. దీని ద్వారా సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా క్యాల్షియం టాబ్లేట్స్ తీసుకునేవారు ఒకసారి డాక్టర్ను సంప్రదించి తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడతారు.

Health Tips: కరివేపాకులో ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయో తేలుసా ...

ఉలవ కషాయం: ఉలవలు కిడ్నీ స్టోన్స్ తగ్గించడానికి చాలా బాగా సహకరిస్తాయి. ఈ ఉలవలతో చేసే కషాయము మీకు కిడ్నీ రాళ్ళను బయటకు పంపించడంలో సహాయపడుతుంది. వాటిని నాలుగు గంటల పాటు నానబెట్టాలి. తర్వాత వీటిని ఒక గ్లాసు నీరు పోసి ఉడక పెట్టాలి. ఇప్పుడు ఉడకపెట్టిన తర్వాత వచ్చిన ఆ నీటి ఆ నీటిని తాగాలి. అదేవిధంగా ఆ ఉలవలను కూడా తిన్నట్లయితే మీకు కిడ్నీలో స్టోన్స్ అనే సమస్య తగ్గిపోతుంది. కిడ్నీలో స్టోన్స్ కరిగించే లక్షణం ఉంది కాబట్టి మీరు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. అనగానే ఈ ఉలవల కషాయాన్ని తాగడం ప్రారంభిస్తే మీ సమస్య తగ్గిపోతుంది.

కొండపిండి ఆకు: కొండపిండి ఆకు పల్లెటూరులో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కూడా కిడ్నీ స్టోన్స్ తగ్గించడానికి సహకరిస్తుంది. ఇది ఈ ఆకుతో మీరు పప్పు ,పచ్చడి చేసుకొని మీరు ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే మీకు ఇడ్లీలో స్టోన్స్ కరిగిపోతాయి. ఇవన్నీ కూడా కేవలం చిన్న సైజులో రాళ్లు ఉన్నప్పుడు మాత్రమే సహాయపడుతుంది. వాటి సైజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది.

ఏర్పడకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా రోజు రెండు నుంచి మూడు లీటర్ల వాటర్ తీసుకోవాలి. ఆహారంలో ఉప్పు తగ్గించాలి. వాకింగ్ చేయాలి, అధిక బరువును తగ్గించుకోవాలి, జంక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్స్ ను మానివేయాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ప్రతిరోజూ 45 నిమిషాల పాటు వ్యాయామం చేస్తూ ఉన్నట్లయితే ఈ కిడ్నీలో స్టోన్స్ రాకుండా మనము నియంత్రించవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.