మెగ్నీషియన్ లోపం వల్ల మన శరీరంలో అనేక రకాలైన వ్యాధులకు దారితీస్తుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే మెగ్నీషియం లోపం డయాబెటిస్ ని కూడా కలగజేస్తుంది. చాలామంది డయాబెటిస్ కి కేవలం కార్బోహైడ్రేట్ కలిగిన ఆహారం తీసుకోవడం చెక్కర ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం ద్వారా మాత్రమే వస్తుందని అనుకుంటారు. కానీ నిజానికి మెగ్నీషియన్ లోపం వల్ల కూడా ఈ టైప్ 2 డయాబెటిస్ అనేది పెరుగుతుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అంతే కాకుండా మన శరీరంలో ఉన్న ఇన్సులిన్ సెన్సిబిలిటీని కూడా ప్రభావితం చేస్తుంది.
మెగ్నీషియం లోపం వల్ల అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. మన శరీరంలో మెగ్నీషియం లోపం ఉందని ఎలా తెలుసుకోవచ్చు.
మన శరీరంలో మెగ్నీషియన్ లోపం ఉంటే మన కండరాలు తిమ్మిరెక్కుతాయి. అదే విధంగా బలహీనత, నీరసం, నిస్సత్తువ, మన హృదయ స్పందన సక్రమంగా ఉండదు. అంతేకాకుండా నిద్రలేమి, వాంతులు, వికారం, ఎముకల, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే మనం కొన్ని ఆహార పదార్థాల ద్వారా ఈ మెగ్నీషియం లోపాన్ని నివారించుకోవచ్చు. ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గుమ్మడి గింజలు: గుమ్మడి గింజల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. దీని ప్రతి రోజు మీరు ఆహారంలో భాగం చేసుకుంటే మీకు మెగ్నీషియం లోపం ఉండదు. దీన్ని సలాడ్స్ రూపంలో, మామూలు చిరుతిండుగా గాని తీసుకున్నట్లయితే ఇందులో ఉన్న పోషకాలు అన్ని మీకు లభిస్తాయి.
ఆకుకూరలు: ఆకుకూరలో ముఖ్యంగా పాలకూర, మెంతుకూరలో, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరానికి కావాల్సిన అధిక మొత్తంలో ఫైబర్, విటమిన్ ను, ఖనిజలవణాలను అందించడంలో సహాయపడుతుంది. ఈ ఆకుకూరలను మీరు ప్రతి రోజు ఆహారంలో భాగం చేసుకుంటే మీకు మెగ్నీషియన్ ని పొందవచ్చు.
బాదం: బాదం గింజల్లో కూడా మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరానికి కావాల్సిన ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ను, ప్రోటీన్లను, కాల్షియంను, విటమిన్ డి ని అందించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు ఈ బాదాం ని తీసుకోవడం ద్వారా మీ శరీరానికి అనేక రకాలైన పోషకాలు లభిస్తాయి. దీని ద్వారా మీరు మెగ్నీషియం లోపాల్ని సరిచేసుకోవచ్చు.
Health Tips: కాల్షియం టాబ్లెట్లు అతిగా వాడుతున్నారా
రాజ్మా: రాజ్మాని కూడా మీరు ఆహారంలో బాదం చేసుకుంటే మీకు మెగ్నీషియం పుష్కలంగా అందుతుంది. ఇందులో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని సూప్స్ లలో, సలాడ్స్ లలో ,అన్నంతో ,చపాతీతో కలిపి తీసుకుంటే మీకు మెగ్నీషియం లోపం ఉండదు.
తాజా పండ్లు: తాజా పనులు అయినటువంటి నారింజ, అరటి పండ్లు, బొప్పాయ వంటి పనులలో అధిక మొత్తంలో మెగ్నీషియం ఉంటుంది. ఇది ఈ పండ్లను తీసుకోవడం ద్వారా మీ శరీరానికి శక్తి అందగడంతో పాటు మెగ్నీషియం కూడా వస్తుంది. ప్రతిరోజు తాజా పండ్లు తీసుకోవడం ద్వారా మీ శరీరానికి కావాల్సినంత మెగ్నీషియం అందుతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.