ఈవర్షాకాలం వచ్చిందంటే చాలు చల్లగాలితో చాలామందికి మైగ్రేన్ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కానీ వాతావరణ మారిన వెంటనే కూడా ఈ మైగ్రేన్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మైగ్రేన్ సమస్యతో చెవులకు గాలి వెళ్లడం ద్వారా తలనొప్పి స్టార్ట్ అవుతుంది. ఇది చల్లగాని వల్ల మైగ్రేన్ సమస్య మరింత ఎక్కువగా అవుతుంది. టాబ్లెట్స్ యూస్ చేయడం ద్వారా తాత్కాలిక ఉపశమనం ఉంటుంది. అలా కాకుండా సహజ పద్ధతులు ద్వారా ఈ సమస్యకు మనము పరిష్కారం చేసుకోవచ్చు ఆ పద్ధతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపు: మైగ్రేన్ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఒక గ్లాసు పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగినట్లయితే ఈ మైగ్రేన్ సమస్య నుంచి బయటపడతారు. అంతేకాకుండా పసుపుతో పాలు కలిపి తీసుకోవడం ద్వారా మీ ఇమ్యూనిటీ అనేది కూడా పెరికి రకరకాల ఇన్ఫెక్షన్ల నుండి దూరం చేస్తుంది.
తులసి అల్లం కషాయం: తులసి అల్లం కషాయం తీసుకోవడం ద్వారా కూడా ఈ మైగ్రేన్ సమస్య నుంచి బయటపడతారు. తులసిలో యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అదే విధంగా అల్లం లో కూడా రకరకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండటం ద్వారా ఈ రెండిటిని కలిపి మీరు టి రూపంలో తీసుకున్నట్లయితే ఈ మైగ్రేన్ సమస్య నుంచి బయటపడతారు. అంతే కాకుండా ఈ రెండిటి వల్ల అనేక రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
Health Tips: కరివేపాకులో ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయో తేలుసా ...
అశ్వగంధ: అశ్వగంధలో మైగ్రేన్ సమస్యను తగ్గించే అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ప్రతిరోజు ఒక స్పూను అశ్వగంధ పొడిని వేడివేడి పాలల్లో కానీ గోరువెచ్చటి నీటిలో గాని కలుపుకొని తాగినట్లయితే మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఈ మైగ్రేన్ సమస్య కూడా చక్కటి పరిష్కారం. మైగ్రేన్ సమస్య అధికంగా అనిపించినప్పుడు కాస్త వామును వేయించుకొని కర్చీఫ్ లో పెట్టుకొని వాసన చూసినట్లయితే మీ మైగ్రేన్ సమస్య తగ్గుతుంది.
సూర్య రష్మి: విటమిన్D లోపం వల్ల కూడా తలనొప్పి సమస్య వేధిస్తూ ఉంటుంది. ఈ మైగ్రేన్ సమస్యను తగ్గించుకోవడానికి విటమిన్ డి అనేది అవసరం. ఈ విటమిన్ డి ని సూర్య రష్మి తగిలే ప్రదేశాల్లో కాసేపు కూర్చున్నట్లయితే మీకు విటమిన్ డి అందుతుంది. దీని ద్వారా కూడా మైగ్రేన్ తలనొప్పి తగ్గించుకోవచ్చు.
హీట్ ప్యాక్: సమస్య అధికంగా అనిపించినప్పుడు తలనొప్పి ఉన్న ప్రదేశంలో కాస్త హీట్ ప్యాకింగ్ పెట్టుకున్నట్లయితే ఉపశమనం లభిస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.