చాలామంది మహిళల్లో పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటారు. వీటిని పీరియడ్ క్రాంప్స్ అంటారు. ఇవి దాదాపుగా అందరూ మహిళలను కనిపించే సాధారణ సమస్య. అయితే కొన్ని మన జీవన శైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ఈ పిరియడ్ క్రాంప్స్ నుంచి ఈజీగా బయటపడవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కారణాలు:
హార్మోనల్ ఇంబాలన్స్ : ముఖ్యంగా హార్మోనల్ ఇంబాలన్స్ వల్ల మహిళల్లో పిరియడ్ క్రాంప్స్ వస్తూ ఉంటాయి. అంతే కాకుండా రక్తహీనత, అలసట నీరసం , ఒత్తిడి పోషకాహార లోపం, కాలుష్యం వల్ల కూడా ఈ పిరియడ్ క్రాంప్స్అనేవి పెరుగుతాయి. కొన్ని రకాల మార్పుల వల్ల మనము ఈ పీరియడ్ క్రాంప్స్ ని తగ్గించుకోవచ్చు.
వ్యాయామం: కొన్ని రకాలైన అప్డోమినల్ వ్యాయామాలు చేయడం ద్వారా పీరియడ్స్ లో వచ్చే క్రాంప్స్ తగ్గిపోతాయి. ముఖ్యంగా పొత్తికడుపులో కండరాల్లో నొప్పులు తగ్గిపోతాయి.
హీట్ ప్యాక్: సాధారణంగా పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ క్రాంప్స్ ని తగ్గించే మరొక చిట్కా హీటింగ్ ప్యాక్. ఇది నొప్పి ఉన్న ప్రదేశంలో హీటింగ్ ఫ్యాక్ గనక కాసేపు పెట్టుకున్నట్లయితే ఆ ప్రదేశంలో ఉన్న నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది.
Health Tips: రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారా.
వేడినీటి స్నానం: పీరియడ్స్ ఉన్నన్ని రోజులు కూడా వేడి నీటి స్నానం చేయడం ద్వారా ఈ క్రాంప్స్ తగ్గుముఖం పడతాయి. వేడి నీటి స్నానం వల్ల కండరాలు నొప్పులు అన్నీ కూడా తగ్గిపోతాయి.
తగినంత నిద్ర: పీరియడ్స్ సమయంలో కావాల్సినంత విశ్రాంతి తీసుకుంటే పిరియడ్స్ నొప్పుల నుండి ఈజీగా బయటపడవచ్చు. శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం ద్వారా ఈ నెలసరిలో వచ్చే క్రాంప్స్ ఈజీగా తగ్గుముఖం పడతాయి.
తక్కువ ఉప్పు: ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ పీరియడ్స్ క్రాంప్స్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి పీరియడ్స్ సమయంలో ఉప్పును తక్కువగా తీసుకుంటే మీరు ఈ క్రాంప్స్ నుంచి బయటపడవచ్చు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.