మన శరీర ఎదుగుదలకు మన శరీరంలోని అన్ని అవయవ్యాలకు ప్రోటీన్ చాలా ముఖ్యమైన పోషకం. కండరాల పెరుగుదలకు, జుట్టు పెరుగుదలకు, చర్మ సంరక్షణకు, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ ప్రోటీన్ సహాయపడుతుంది. మన శరీరంలో వచ్చే అనేక రకాల ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి కూడా ఈ ప్రోటీన్ చాలా అవసరం. శాకాహారులకు కూడా ఉత్తమమైన ప్రోటీన్ లభించే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.
పప్పులు: పప్పులన్నింట్లో కూడా ప్రోటీన్ అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా మసూర్ దాల్, బీన్స్, రాజ్మా వంటి వాటిలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. రెగ్యులర్ గా కనుక మీరు ఈ ఈ పప్పులు తీసుకున్నట్లయితే మీకు ప్రోటీన్ లోపం సమస్య ఉండదు.
Health Tips: బోడ కాకరకాయల్లో ఉండే ఔషధ గుణాల గురించి తెలుసా.
పాల ఉత్పత్తులు: పాలు ,పాల ఉత్పత్తులను కూడా ప్రోటీన్ అధికంగా ఉంటుంది. అధికంగా ఉంటుంది. మీరు మీ ఆహారంలో ప్రోటీన్ ని ఎక్కువగా తీసుకోవాలనుకుంటే పాల ఉత్పత్తులు తీసుకుంటే మీరు ఆ సమస్య నుంచి బయటపడతారు.
ఆకుకూరలు: ఆకుకూరల్లో కూడా ప్రోటీన్ అధిక శాతం ఉంటుంది. పాలకూర, మెంతికూర తోటకూరలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. మీరు ప్రతి రోజు ఆకుకూరలను ఆహారంలో బాధలు చేసుకున్నట్లయితే మీరు ప్రోటీన్ సమస్య నుంచి బయటపడతారు
నట్స్: నట్స్ లో కూడా ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా బాదాం, పల్లి, గుమ్మడి గింజలు, చియా సీడ్స్, అవిస గింజల్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ కూడా అధికంగా ఉంటాయి. కావాల్సిన శక్తిని ప్రోటీన్ ని అందేలా చేస్తాయి. ఈ ఆహార పదార్థాలను కనుక మీరు రెగ్యులర్గా మీ ఆహారంలో భాగం చేసుకుంటే మీరు ప్రోటీన్ లోపం సమస్య నుంచి బయటపడతారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.