(Photo Credits: Pixabay)

కొంతమంది తరచుగా కడుపునొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇది అల్సర్స్ వల్ల  మలబద్ధకం, జీర్ణం సమస్యల వల్ల ,పేగుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా ఈ కడుపునొప్పి వస్తుంది. ఈ కడుపునొప్పి కారణాలేంటి దానికి తగిన చికిత్సలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తరచుగా కడుపునొప్పి వస్తే మీరు మరింత ఆహారం పైన శ్రద్ధ పెట్టాలి ఒక్కొక్కసారి డయాబెటిస్, ఆర్థరైటిస్, క్యాన్సర్, డిప్రెషన్ వంటి వ్యాధుల వల్ల కూడా ఈ కడుపునొప్పికి కారణం అవుతుంది. అంతేకాకుండా ప్రేగుల్లో ఏర్పడిన పుండ్లు కారణంగా కూడా ఈ కడుపునొప్పి వస్తుంది. దీన్ని మీరు లేట్ చేసినట్లయితే అది క్యాన్సర్ గా మారే ప్రమాదం ఉంది.

కడుపునొప్పికి కారణాలు: కడుపు నొప్పికి కారణాలు కడుపులో ఇన్ఫెక్షన్ గురికావడం మన శరీరంలో ఎక్కువగా చెడు ఆహార అలవాట్లు బలహీనమైన రోగనిరోధక శక్తి ,స్ట్రెస్, పొల్యూషన్ ,ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు కూడా దీనికి ఒక కారణం.  రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో కూడా ఈ కడుపులో నొప్పి ఎక్కువగా వస్తుంది.

కడుపు నొప్పిని తగ్గించే ఆహారాలు:

పసుపు: పసుపు యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, ఫైబర్ పుష్కలంగా ఉండడం ద్వారా మీ కడుపునొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది .

తేనె: తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది కడుపులో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే తగ్గించి మీ కడుపునొప్పి సమస్య తగ్గిస్తుంది.

మొలకెత్తిన గింజలు: మొలకెత్తిన గింజలు తీసుకోవడం ద్వారా మీ జీర్ణ క్రియ సక్రమంగా జరుగుతుంది. అంటే కాకుండా పోషకాలను ఇస్తుంది కాబట్టి మీరు కడుపునొప్పితో బాధపడుతుంటే మొలకెత్తిన గింజలు తీసుకోవడం చాలా ఉత్తమం.

Health Tips: శొంఠి కషాయం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసా

ఆకుకూరలు: ఆకుకూరల్లో బచ్చలి కూర తోటకూర పాలకూర వంటివి కడుపునొప్పికి చక్కటి ఉపశమనంగా ఉంటాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉండడం ద్వారా మలబద్ధకం సమస్య, అజీర్ణం, కడుపునొప్పి వంటి సమస్యల నుండి బయట పడేస్తుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గించడానికి సహాయపడుతుంది.

అవిస గింజలు: అవిస గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల్లో కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకోవడం ద్వారా మీ కడుపునొప్పి, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గిపోతాయి. దీని ద్వారా మీరు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. గట్ సమస్యతో బాధపడుతున్న వారు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ సరైన సమయానికి నిద్రపోయి రోజు కనీసం 45 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే ఈ సమస్యలన్నీ తగ్గిపోతాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి