ginger

మధుమేహం వ్యాధి ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్న సమస్య. ఇది సైలెంట్ కిల్లర్ గా ఉండి జీవితాంతం కూడా మనం అనేక రకాల జబ్బులకు గురిచేస్తుంది. ఒకసారి షుగర్ వ్యాధి వచ్చింది అంటే చాలు జీవితాంతం మందులు వాడాల్సిందే. అయితే మన జీవనశైలిలో కొన్ని మార్పులు పోషకాహారం తీసుకుంటూ డాక్టర్ సూచించిన మందులు ఇన్సులిన్ తీసుకోవడం ద్వారా ఈ మధుమేహాన్ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. అయితే శొంఠి పొడి నీరును ఉపయోగించి షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు ఏ విధంగా తెలుసుకున్నాం.

మధుమేహం: మధుమేహం వ్యాధి ఉన్నవారు శొంఠి పొడిని ఉపయోగించి వాళ్ళ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ శొంఠి పొడిలో రక్తంలో ఉన్న షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇతర అనేకరకాల ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో ఇదే సహాయపడుతుంది.

అల్లం లో గ్లూకోస్ ను తగ్గించే అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి దీన్ని రెగ్యులర్ గా మీరు తీసుకున్నట్లయితే మీ రక్తంలోని చక్కర స్థాయిలో కంట్రోల్లో ఉండి ఏ ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది.

కేవలం షుగర్ వ్యాధి కాకుండా ఇంకా అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో ఈ సొంటి కషాయం సహాయపడుతుంది.

జీర్ణ వ్యవస్థ: గ్యాస్ ,కడుపుబ్బరం వంటి సమస్యలతో బాధపడేవారు ఈ సొంటిని కషాయాన్ని తీసుకున్నట్లయితే జీర్ణ ఎంజైములను ఉత్పత్తి చేసి మన జీర్ణ క్రియ రేటును పెంచుతుంది.

జలుబు ,దగ్గు: వర్షాకాలంలో ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్యలు జలుబు దగ్గు గొంతు నొప్పి కషాయంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. దీన్ని మీరు రెగ్యులర్ గా తీసుకుంటే గొంతు నొప్పి, జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది.

Health Tips: కొలెస్ట్రాల్ ఉన్నవారికి బ్రౌన్ రైస్ మంచిదా..వైట్ రైస్ మంచిదా.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది: మధుమేహం ఉన్న పేషెంట్లో కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు మీరు ఈ సొంటి కషాయం తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అంటే కాకుండా ఇది గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. బిపి పేషెంట్స్ కూడా బీపీ కంట్రోల్ లో ఉంటుంది.

మానసిక ఒత్తిడి: ఇందులో యాంటీ ఆక్సిడెంట్సు ,ఆంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉండడం ద్వారా మానసిక సమస్యల నుంచి కూడా బయటపడేస్తాయి. ముఖ్యంగా ఉద్యోగం వల్ల ఒత్తిడి,  ఆందోళన గురయ్యే వారు ప్రతి రోజు ఈ శొంఠి కషాయం తీసుకుంటే మీకు ఈ ఇబ్బంది నుండి బయటపడతారు.

శొంఠి కాషాయం తయారీ విధానం: ఒక గ్లాసు నీటిలో రెండు గ్రాముల శొంఠి పొడిని వేసి రుచికి తగ్గగా చిటికెడు ఉప్పు వేసి మరిగించాలి . తర్వాత ఈ నీటిని ఖాళీ కడుపుతో తీసుకుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.