రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఈ సూపర్ ఫుడ్స్ తీసుకున్నట్లయితే మీకు హిమోగ్లోబిన్ పెరిగి రకరకాల జబ్బుల నుండి బయటపడతారు.
మన శరీరానికి రక్తం చాలా అవసరం రక్తం తక్కువగా ఉంటే మన అవయవాలకు ఆక్సిజన్ సరఫరా సరిగా అందదు. అలాంటప్పుడు అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి ముఖ్యంగా కళ్ళు తిరగడము, అలసట, నీరసం,ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఆహారంలో ఐరన్, విటమిన్ బి12, పోలేట్, ఉన్న ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీని ద్వారా మీ రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు.
ఐరన్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు.
బచ్చలి కూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీని మీరు ఆహారంలో భాగం చేసుకుంటే మీ శరీరానికి కావాల్సినంత ఐరన్ లభిస్తుంది. సోయాబీన్స్ లో కూడా ఐరన్ కండక్ట్ ఎక్కువగా ఉంటుంది. బీట్రూట్ కూడా మీ శరీరంలో రక్తహీనత సమస్యలు తగ్గిస్తుంది. దానిమ్మ పండులో కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీరు తీసుకున్నట్లయితే మీ శరీరంలో ఐరన్ లోపం ఉండదు.
మెంతుకూరలో కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది తీసుకుంటే మీకు ఐరన్ లోపం సమస్య నుంచి బయటపడతారు.
Health Tips: మొలకెత్తిన పెసలు తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసా.
బి12 అధికంగా ఉన్న ఆహార పదార్థాలు.
పాలలో విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. ప్రోటీన్ తో పాటు విటమిన్ బి12, వల్ల మీ శరీరానికి కావాల్సినంత శక్తి లభిస్తుంది. పెరుగులో కూడా విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. ఇది మీ కండరాలకు కావలసిన శక్తిని మీ శరీరానికి కావాల్సిన రక్తాన్ని తయారు చేయడంలో సహాయపడుతుంది. కోడిగుడ్డులో కూడా విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. ప్రతిరోజు ఒక కోడిగుడ్డును మీ ఆహారంలో భాగం చేసుకుంటే మీరు రక్తహీనత సమస్య నుంచి అదేవిధంగా ప్రోటీన్ లోపం సమస్య నుంచి కూడా బయటపడతారు.
పోలేట్ అధికంగా ఉన్న పదార్థాలు.
మీ రక్తాన్ని తయారు చేయడానికి కావలసిన ఇంకొక ముఖ్య మూలకము పోలేట్. ఇది అధికంగా ఉన్న ఆహార పదార్థాలు బ్రొకోలీని మీరు ప్రతి రోజు ఆహారంలో భాగం చేసుకుంటే పోలీసు సమస్య నుంచి బయటపడతారు. మునగాకు లో కూడా పోలేటు అధికంగా ఉంటుంది. ఇది కూడా మీరు ఆహారంలో భాగం చేసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడతారు. అంతేకాకుండా విటమిన్ సి అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే కూడా మీరు రక్తహీనత సమస్య నుంచి బాధపడతారు. అంతేకాకుండా విటమిన్ సి ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మీలో ఇమ్యూనిటీ పెరిగి ఇన్ఫెక్షన్ నుండి బయటపడతారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.