ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఇబ్బంది పడే సమస్య మోకాళ్ళ నొప్పులు. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వచ్చేవి. ఇప్పుడు 30 ఏళ్ల వయసు ఉన్న యువత కూడా వస్తుంది. దీనికి కారణాలు ఏంటో దీనికి తగిన చికిత్స ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Health Tips: మునగాకు పొడిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ ...
మనం రోజువారి జీవితంలో ఎక్కువగా పని పనిచేసే అవయవం మోకాలు. నడవడం పరిగెత్తాడం మెట్లు ఎక్కడం రోజువారి పనులలో భాగంగా చేసుకుంటూ ఉంటాం. అయితే ఒక్కొక్కసారి రెండు మూడు మెట్లు ఎక్కాలి అన్న కూడా విపరీతమైన నొప్పితో బాధపడుతుంటారు. నొప్పి వల్ల చాలామంది ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. అధిక బరువు ఉండటం మోకాలలో గుజ్జు అరిగిపోవడం వ్యాయామం లేకపోవడం, షుగర్ వ్యాధితో బాధపడడం , శరీరంలో విటమిన్ D3 తక్కువగా ఉండటం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా కొంతమందిలో మోకాళ్ళ గుజ్జు అరిగిపోతుంది. దీనివల్ల వారికి మోకాళ్ళ నొప్పులు చిన్న వయసులోనే ఏర్పడతాయి. వీటి తగ్గించుకోవడం కోసం మన ఆయుర్వేదంలో చక్కటి రెమిడి ఉంది.
మహాబీర గింజలు : మహాబీర గింజలు ఇవి తులసి జాతికి చెందినవి. చూడడానికి తులసి గింజలనే ఉంటాయి. ఇందులో మోకాళ్ళను నొప్పులు తగ్గించే అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. మోకాళ్ళలోకి జారిపోయిన వారు ఈ మహాబీర విత్తనాలు ప్రతిరోజు తీసుకున్నట్లయితే కేవలం రెండు నుంచి మూడు నెలల్లోనే మీ మోకాళ్లలో గుజ్జు అనేది తిరిగి ఏర్పడి మీరు మోకాళ్ళ నొప్పుల సమస్య నుంచి బయటపడతారు. మహాబీర విత్తనాలు మార్కెట్లో లభిస్తాయి అదే విధంగా అన్ని ఆయుర్వేదం షాప్స్ లో కూడా లభిస్తాయి. ఈ మహాబీర విత్తనాలను రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో వన్ స్పూన్ వేసుకొని నైట్ అంతా నాననివ్వాలి ఉదయాన్నే టిఫిన్ చేసిన అరగంట తర్వాత ఈ నీటితో పాటు ఆ గింజలను కూడా తినాలి. ఈ విధంగా ఒక రెండు నుంచి మూడు నెలలు చేసినట్లయితే మీ మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుంది. అంతేకాకుండా శరీరానికి తగినంత వ్యాయామం ,శరీరానికి తగినంత సూర్యరశ్మి అందేలాగా చూడాలి. దీని ద్వారా విటమిన్ డి మీ శరీరానికి అందుతుంది. అంతేకాకుండా అధిక బరువు ఉన్నవాళ్లు బరువు తగ్గించుకోవాలి. జంక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. మీరు బరువును నియంత్రించుకోవడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి తగ్గిపోతాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.