Kidney Representative Inage

చాలామంది పురుషులు, స్త్రీలు యూరిన్ ఇన్ఫెక్షన్స్  సమస్యతో బాధపడుతుంటారు. ఇన్ఫెక్షన్స్ వల్ల రకరకాల అయినటువంటి సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా యూరిక్ యాసిడ్ అధికమవడం ద్వారా మన శరీరంలో దీని పరిమాణం పెరగడం ద్వారా మూత్రపిండాల్లో రాళ్లు ,మూత్ర సంబంధ వ్యాధులకు దారితీస్తుంది. ముఖ్యంగా కొన్ని రకాలైనటువంటి కాయగూరలు యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతాయి. కాబట్టి ఆ సమస్యతో బాధపడేవారు ఆహారం పైన కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ ఆహార పదార్థాలను తగ్గిస్తే మీకు కీళ్లనొప్పులు, మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రంలో ఇన్ఫెక్షన్లకి తగ్గించడానికి సహాయపడుతుంది. ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం

పాలకూర:  పాలకూరలో అధిక మొత్తంలో ప్యూరిన్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా మన శరీరంలోని యూరిక్ ఆసిడ్ లెవెల్ ను పెంచుతుంది. కిడ్నీలో రాళ్ల సమస్యలను పెంచే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి దీన్ని చాలా తప్పు పరిమాణంలో తీసుకుంటే మీకు కిడ్నీలో రాళ్ల సమస్యలు యూరిక్ ఆసిడ్ పెరగడం వంటి సమస్యలు తగ్గిపోతాయి.

కాలీఫ్లవర్: క్యాలీఫ్లవర్ లో కూడా యూరిక్ యాసిడ్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యలు ఉన్నవారు దీన్ని తీసుకోకపోవడమే ఉత్తమం. దీంట్లో ప్యూరిన్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతుంది. కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల అనేక రకాలైనటువంటి జబ్బులు వస్తాయి.

టమాటా: టమాటాలు కూడా ప్యూరిన్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఇది కొంతమందిలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతుంది. కాబట్టి వారిలో కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటివారు దీన్ని తీసుకోకపోవడమే ఉత్తమం.

Health Tips: వర్షాకాలంలో మీ రోగనిరోధక శక్తి బలహీనపడుతుందా.

పుట్టగొడుగులు: పుట్టగొడుగుల్లో కూడా   ప్యూరిన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్స్ స్థాయిలను పెంచడానికి దోహదం చేస్తాయి. కాబట్టి వీటిని మితంగా తీసుకుంటే ఉత్తమం.

పచ్చి బఠానీలు: కూడా ప్యూరిన్లో అధికంగా ఉంటాయి. దీన్ని అతిగా తీసుకోవడం ద్వారా మీ యూరిక్ యాసిడ్ సమస్య మరింతగా పెరుగుతుంది. దీని ద్వారా గౌటు మూత్రపిండాల్లో రాళ్లు, మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉంది, మీ ఆరోగ్యం కోసం పోషకాహారాలను అధికంగా తీసుకోండి ,మీకు సమస్య మరి ఎక్కువగా అనిపిస్తే వైద్యుని సంప్రదించడం చాలా ముఖ్యం.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.