Health Tips: మన శరీరానికి అనేక రకాల విటమిన్లు అవసరం అందులో ముఖ్యంగా విటమిన్ డి చాలా ముఖ్యమైనది. ఇది ఎముకల బలానికి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. విటమిన్ డి తక్కువ అయినప్పుడు అలసట ఎముకల్లో నొప్పులు, కీళ్ల నొప్పులు, రోగనిరోధక వ్యవస్థ బలహీన పడడం వంటివి సమస్యలు ఏర్పడతాయి. అయితే విటమిన్ డి కి ఉత్తమ మార్గం సూర్యకాంతి .అయితే ఈ రోజుల్లో చాలామంది పని కారణంగా ఎక్కువసేపు ఎండలో ఉండలేకపోతున్నారు. దానివల్ల కొన్ని ఆహార పదార్థాలు చేర్చుకోవడం ద్వారా విటమిన్-డి వరకు అందుతుంది.
చేపలు- సాల్మన్ ట్యూనా వంటి చేపల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఈ చేపలలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా గుండెకు మేలు జరుగుతుంది. విటమిన్ డి పుష్కలంగా కూడా అందుతుంది.
కోడిగుడ్లు- కోడిగుడ్డులో పచ్చ సోనాలో విటమిన్ డి పుష్కలంగా ఉన్నట్టు నిపుణులు తెలిపారు. దీన్ని తీసుకోవడం ద్వారా మన శరీరానికి ఒక రోజుకు కావాల్సిన విటమిన్ టి లభిస్తుంది. అంతేకాకుండా ఇది కండరాల బలోపేతానికి సహాయపడుతుంది. మన శరీరానికి తగినంత విటమిన్ కూడా లభిస్తుంది. అల్పాహారంలో వీటిని తీసుకోవడం వల్ల రోజంతా కూడా అలసట లేకుండా ఉంటారు.
Health Tips: భోజనం చేసిన వెంటనే మీ కడుపు ఉబ్బరంగా అనిపిస్తుందా
పాలు పాల ఉత్పత్తులు- పాలు పెరుగు పన్నీరు జున్ను వంటి వాటిలలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. మీరు ప్రతి రోజు వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మీకు రోజుకు కావాల్సినంత విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది.
పొద్దు తిరుగుడు గింజలు- పొద్దుతిరుగుడు విత్తనాలను విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. వీటిని వేయించుకొని తినొచ్చు లేదా సలాడ్ రూపంలో తీసుకోవచ్చు.
పుట్టగొడుగులు- పుట్టగొడుగుల్లో కూడా విటమిన్ డి సహజంగా పుష్కలంగా ఉంటుంది. ఇది ఎండలో పెరిగే పుట్టగొడుగుల్లో చాలా ఎక్కువ మోతాదులో విటమిన్ డి ఉంటుంది. వీటిని మీరు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడతారు.