చాలామంది ప్రజలకు ప్రయాణాలు చేయడానికి ఇష్టం ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రయాణం చేసేటప్పుడు వారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా కొంతమందికి ప్రయాణాలు చేస్తున్నప్పుడు వాంతులు, తల తిరగడం, వికారం వంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనిని కైనె టోసిన్ అంటారు.

ప్రయాణ సమయంలో వాంతులు రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలను ప్రయత్నించండి.

అల్లం- ప్రయాణ సమయంలో వాంతులు, వికారం వంటి సమస్యలు ఉన్నవారు ఒక చిన్న అల్లం ముక్కను లేదా అల్లం మురబ్బాను నోట్లో పెట్టుకొని ఉంచుకోవడం మంచిది. దీని ద్వారా మీకు తల తిరగడం, వాంతులు, వికారం నుండి ఉపశమనం లభిస్తుంది.

లవంగం- ప్రయాణాల్లో లవంగాన్ని నోట్లో వేసుకోవడం ద్వారా వాంతులు, వికారం  సమస్యల నుండి బయటపడతారు.

Health Tips: ప్రతిరోజు నాన్ వెజ్ తింటున్నారా.

నిమ్మకాయ- చాలామంది ప్రయాణాలలో నిమ్మకాయను వాసన చూసినట్లయితే ఈ వాంతులు, తల తిరగడం, వికారం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

తులసి ఆకులు-  ప్రయాణాల్లో వికారం వాంతులు సమస్యతో బాధపడేవారు నాలుగు తులసాకులను నోట్లో వేసుకొని నమలడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడతారు.

మరికొన్ని చిట్కాలు

ప్రయాణ సమయంలో వాంతులు అయ్యేవారు ఆయిల్ ఫుడ్లకు దూరంగా ఉంటే ఉత్తమం. వీరు ప్రయాణించేటప్పుడు బస్సుల్లో లేదా కారులో ముందు సీట్లో కూర్చోవడం వల్ల ఈ సమస్య కొద్దిగా తగ్గుతుంది.

కొంతమందికి ఏసి పడదు దీని ద్వారా వారు వాంతులు అవుతాయి. కాబట్టి విండోని ఓపెన్ చేసుకోవడం ఉత్తమం.

ప్రయాణ సమయంలో ఎక్కువ నీరు తాగకుండా ఉండాలి. దీని ద్వారా కూడా మీకు వికారం వచ్చే ఛాన్స్ ఉంది.

ప్రయాణాలు చేసేటప్పుడు మితంగా తినడం ఉత్తమం. అధికంగా తినడం ద్వారా అది కడుపులో తిప్పి వాంతులు అయ్యే అవకాశాలు ఉంటాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.