ఈరోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య అధిక బరువు. అధిక బరువు వల్ల చాలా రకాలైన జబ్బులు వస్తుంటాయి. షుగర్, రక్తపోటు, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు మోకాళ్ళ నొప్పులు, వంటి సమస్యలు అన్నిటికీ కూడా కారణం.
అధిక బరువు తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో రకరకాలైనటువంటి ఔషధాలు ఉన్నాయి. దాల్చిన చెక్కను మసాలా దినుసుగా వాడుతుంటారు కానీ ఇందులో ఉన్న అద్భుతమైన గుణాలు తెలిస్తే షాక్ అవుతారు. దాల్చిన చెక్క ఫ్లేవర్ కోసమే కాదు ఇందులో అనేక రకాలైనటువంటి అద్భుతమైన ఔషధ గుణాలను ముఖ్యంగా ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల మన శరీరానికి ఇమ్యూనిటీ పెంచడంతోపాటు అనేక రకాలైన జబ్బులను రాకుండా చేయడంలో ఈ దాల్చిన చెక్క చాలా బాగా సహాయపడుతుంది.
దాల్చిన చెక్క కషాయాన్ని మీరు ప్రతిరోజు తీసుకున్నట్లయితే మీ శరీరంలో కొలెస్ట్రాల్ శాతం తగ్గుతుంది. అంతేకాకుండా అధిక బరువు నుండి కూడా బయటపడతారు. దిగిన ద్వారా అనేక రకాలైన జబ్బులు రాకుండా కాపాడుతుంది. దాల్చిన చెక్కను ప్రతిరోజు మీరు ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే కిడ్నీ సమస్యలు అధిక బరువు, షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. రక్తపోటు రాకుండా చేస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల తగ్గించడంలో ఈ దాల్చిన చెక్క కషాయం బాగా సహకరిస్తుంది.
Health Tips: ఖాళీ కడుపుతో ఈ 3 ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి ...
దాల్చిన చెక్క కషాయం తయారు చేసుకునే విధానం. 100 గ్రాముల దాల్చిన చెక్కను తీసుకొని కాస్త వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. ప్రతిరోజూ ఒక గ్లాస్ నీటిలో రెండు నుంచి మూడు గ్రాముల దాల్చిన చెక్క పొడి వేసుకొని అర గ్లాసు అయ్యేవరకు మరిగించుకోవాలి. ఆ తర్వాత ఆ నీటిని వడకట్టుకొని తాగాలి. ప్రతిరోజు ఏదైనా సమయంలో తీసుకున్నట్లయితే ఇది మీ శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తుంది ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇందులో ఉన్న ఫైబర్ కారణంగా మీకు మలబద్ధకం సమస్య నుంచి కూడా బయటపడుతుంది. జీర్ణ సంబంధ సమస్యలు కూడా తగ్గిపోతాయి. అజీర్ణ సమస్యలు కూడా తగ్గిపోతాయి. అయితే దాల్చిన చెక్కకు కొంచెం వేడి చేసే గుణం ఉంది కాబట్టి ఇది తీసుకున్నన్ని రోజులు కాస్త మజ్జిగను కూడా తీసుకున్నట్లయితే మీకు కడుపు మంట సమస్య రాకుండా ఉంటుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.