ajwan

వాము మనందరికీ తెలిసిందే. వామును ప్రతి ఒక్క వంటలో వాడుకుంటా ఉంటాం. ముఖ్యంగా చిరుతిళ్ళు, పిండి వంటల్లో ఇది వాడుతూ ఉంటాం. దీన్ని ఇది కేవలం రుచికే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ వాములో అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

విరోచనాలు: వాములో విరోచనాలను తగ్గించే అద్భుతమైన ఔషధ గుణం ఉంది బాగా విరోచనాలు అయ్యేవారు ఒక స్పూను వామును గనుక తీసుకున్నట్లయితే మీకు విరోచనాలు తగ్గిపోతాయి.

 కడుపునొప్పి: అదేవిధంగా కడుపునొప్పితో బాధపడేవారు ఒక స్పూను వాము తీసుకున్నట్లయితే మీ కడుపునొప్పి తగ్గిపోయి తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా అజీర్ణ సమస్యతో బాధపడేవారు ఒక స్పూను వాము తీసుకున్నట్లయితే మీ సమస్య చిటికలో తగ్గిపోతుంది.

Health Tips: బ్రౌన్ రైస్‌లో ఉన్న ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు తెలుసా ...

జలుబు: జలుబు దగ్గుతో బాధపడేవారు వాముని కాస్త వేడి చేసుకొని ఒక కర్చీఫ్ లో వేసుకొని వాసన చూసినట్లయితే మీ జలుబు దగ్గు త్వరగా తగ్గిపోతాయి.

 దంతాలు : వాముని వేయించుకొని పొడిచేసుకుని ఆ పొడి తో మీ దంతాలను కనుక శుభ్రం చేసుకున్నట్లయితే మీ పంటి నొప్పి చిగుళ్ళ వాపు చిగుళ్ళ నుంచి రక్తం కారడం వంటి సమస్య నుంచి తొందరగా బయటపడతారు.

 రక్తహీనత : వాముని వేయించుకొని పొడి చేసుకుని అందులో కొంచెం ఉప్పు వేసుకుని ఆహారంలో మొదటి ముద్దగా తీసుకున్నట్లయితే మీకు రక్తహీనత సమస్య నుంచి బయటపడతారు.

గ్యాస్ట్రబుల్ : వాము పొడిని మధ్యలో కలిపి తీసుకొని ప్రతిరోజు రెండు మూడు సార్లు తీసుకున్నట్లయితే మీకు గ్యాస్ట్రబుల్, కడుపునొప్పి, కడుపుబ్బరం సమస్యల నుంచి బయటపడతారు .

 మూత్ర సంబంధ సమస్యలు: వాముని మీరు ప్రతి రోజు తీసుకోవడం ద్వారా మీ మూత్రంలో ఉన్న ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా తగ్గిపోయి మూత్ర సంబంధ సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.