phool makana

ఫుల్ మఖానను తామర గింజలు అని కూడా పిలుస్తా.రు ఇది అత్యంత పోషకాలు ఉన్న ఆరోగ్యకరమైన ఆహారం. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండి సులభంగా జీర్ణం అవుతుంది. ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, వంటివి పుష్కలంగా ఉంటాయి. అయితే ఇది మటన్ కంటే పది రెట్లు బలాన్ని ఇచ్చే శక్తివంతమైన ఆహారంగా చెప్పవచ్చు, దీన్ని ఏ విధంగా తినొచ్చు కూడా తెలుసుకుందాం.

ఫుల్ మఖానా నెయ్యి- నెయ్యిలో వేయించి తింటే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. నెయ్యిలో ఉన్న పోషకాలు కూడా ఇందులో కలవడం ద్వారా శక్తిని ఇస్తాయి. దీన్ని తీసుకోవడం ద్వారా ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ లభిస్తాయి. కండరాలకు బలాన్ని అందిస్తుంది. తక్షణ శక్తి అందించడంలో కూడా సహాయపడుతుంది. గుండెకు ఎముకల ఆరోగ్యానికి చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది.

పాలు ఫుల్ మఖాన- కూల్ మఖాన ను పాలలో మరిగించుకొని తీసుకోవడం ఇది ఒక రకమైన పద్ధతి. ఇలా తీసుకోవడం ద్వారా పాలలో ఉండే క్యాల్షియం, ప్రోటీన్ అందుతుంది. వీటిలో ఉండే క్యాల్షియం ప్రోటీన్ ఎముకల బలాన్ని పెంచుతుంది. ముఖ్యంగా పాలు మఖాన తీసుకోవడం వల్ల శరీరానికి బలాన్ని అందిస్తుంది. కండరాలు వేగంగా పెరుగుతాయి. పిల్లలకు ఇచ్చినట్లయితే ఇది వారి ఎదుగుదలకు సహాయపడుతుంది. ఒక కప్పు పాలలో 50 గ్రాముల పూల్ మఖాన వేసి బాగా మరిగించుకోవాలి. ఉడికిన తర్వాత దీంట్లో కాస్త బెల్లాన్ని వేసుకొని తిన్నట్లయితే మీకు అనేక రకాల పోషకాలు అందుతాయి. నిద్రలేమి సమస్య కూడా ఉండదు. దీన్ని తీసుకోవడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఫుల్ మఖానాలో తక్కువ క్యాలరీలు ఉంటాయి.  దీనివల్ల బరువు తగ్గుతారు.

Health Tips: చలికాలంలో పెరుగు తినడం ఆరోగ్యానికి హాని చేస్తుందా..

ఇతర ప్రయోజనాలు.

గుండె ఆరోగ్యానికి మంచిది- పూల్ మఖానాలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. అంటే కాకుండా గుండె సంబంధం వ్యాధులు రాకుండా చేస్తుంది. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం ద్వారా బీపీ సమస్యను నియంత్రిస్తుంది.

క్యాన్సర్ ను తగ్గిస్తుంది- పూల్ మఖానాలో ఫ్లేవర్ ఆయిల్ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.

బరువు తగ్గుతారు- పూల్ మఖానాలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇందులో అధిక ప్రోటీన్ ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కటి ఎంపికగా చెప్పవచ్చు. మటన్ కంటే పది రెట్లు శక్తివంతంగా ఉండాలనుకునేవారు నెయ్యిలో లేదా పాలలో వేయించిన ఫూల్ మఖాన్ని తింటే చాలు. దీని ద్వారా శరీరం దృఢంగా మారుతుంది. రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

 Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి