pixabay

ఖర్జూరాలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇందులో ఉన్న పోషకాలు పిల్లలనుండి పెద్దల వరకు అందరికీ ఉపయోగపడతాయి. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి చలిని తగ్గించడానికి ఖర్జూరాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాకుండా దీని వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది- ఖర్జూరం చలికాలంలో మన శరీర ఉష్ణోగ్రతను కాస్త పెంచుతుంది. దీనివల్ల చలికాలంలో జలుబులు రాకుండా ఉంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో రెండు నుంచి మూడు ఖర్జూర పండ్లు తినడం ద్వారా మన శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. ఇది జలుబు దగ్గు వంటి వాటిని తగ్గించడానికి సహాయపడుతుంది. దీన్ని తీసుకోవడం ద్వారా ఇందులో ఉండే షుగర్స్ పోషకాలు మన శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి.

Health Tips: మధ్యాహ్నం అరగంట నిద్రతో ఎన్ని లాభాలు తెలుసా. 

ఇమ్యూనిటీ- చలికాలంలో తరచుగా జలుబు దగ్గు గొంతు నొప్పి ఫ్లూ వంటి సమస్యలు పెరుగుతాయి. అటువంటివారు ప్రతిరోజు రెండు ఖర్జూరాలను తీసుకోవడం ద్వారా రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఇందులో ఉన్న ఆంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి, బీటా కేరోటిన్ ,వంటివి సీజనల్ వ్యాధుల భార్య పడకుండా చేస్తాయి. ఖర్జూరం తినడం ద్వారా తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. దీని ద్వారా ఇన్ఫెక్షన్ల పైన పోరాడుతుంది. ఖర్జూరాలు తీసుకోవడం ద్వారా అనేక రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్ నుండి బలపరుస్తుంది.

తక్షణ శక్తిని- ఖర్జూరాలు తీసుకోవడం ద్వారా తక్షణ శక్తి లభిస్తుంది. చలికాలంలో వాటర్ తక్కువగా తాగడం ద్వారా నీరసంగా అలసిపోతూ ఉంటారు. అటువంటి వారు ఖర్జూరాలు తినడం ద్వారా మీకు శరీరానికి కావలసిన పూర్తి శక్తి అందించి రోజంతా అలసట లేకుండా ఉంచుతుంది.

జీర్ణ వ్యవస్థకు మంచిది- చలికాలంలో జీర్ణ వ్యవస్థ కాస్త మందంగా ఉంటుంది. తరచుగా మలబద్ధకం అజీర్ణం వంటి సమస్యలు ఏర్పడతాయి. అటువంటివారు ఖర్జూరం తీసుకోవడం ద్వారా ఈ సమస్యను తగ్గిపోతాయి. ఖర్జూర పండులో అధిక మొత్తంలో ఫైబర్ ఉండడం ద్వారా ఇది మలబద్ధకం వంటి సమస్యలు తగ్గిస్తుంది. పేగుల కదలికను సక్రమంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీని ద్వారా జీర్ణ క్రియ సక్రమంగా ఉంటుంది.

విటమిన్లు, మినరల్స్ అధికం- ఖర్జూర పండులో విటమిన్ బి, విటమిన్ కే, పొటాషియం, మెగ్నీషియం ,క్యాల్షియం, కాపర్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకల బలం చేయడంలో సహాయ పడితే అంతేకాకుండా గుండె కండరాలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా ఖర్జూర పండ్లను తీసుకోవడం ద్వారా మన శరీరం ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా ఐరన్ లోపలితో ఉన్నవారికి ఇది రక్తహీనత వంటి సమస్యలను దూరం చేస్తుంది.

ఎలా తినాలి- ఉదయాన్నే ఖాళీ కడుపుతో రెండు నుంచి మూడు ఖర్జూర పండ్లు తినొచ్చు. లేదా స్మూతీ లేదా డ్రై ఫ్రూట్ మిశ్రమంలో ఖర్జూనాలను ఉపయోగించి కూడా తీసుకోవచ్చు. లేదా ఖర్జూరం లడ్డు లేదా ఖర్జూరం బర్ఫీ వంటివి చేసుకొని కూడా తినవచ్చు. దీని ద్వారా ఇందులో ఉన్న పోషకాలు అన్నీ కూడా మీ శరీరానికి లభిస్తాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి