వర్షాకాలం వచ్చిందంటే చాలు అనేక రకాలైనటువంటి ఇన్ఫెక్షన్ల బారిన పడుతూ ఉంటాం. వైరస్, బ్యాక్టీరియా, ఫంగల్, ఇన్ఫెక్షన్స్ తోటి బాధపడుతూ ఉంటాము. అలాంటప్పుడు మనము మన ఇమ్యూనిటీని పెంచుకోవాలి. ఈ వైరల్ ఫీవర్స్ అనేవి కూడా తగ్గిపోతాయి దీనికి చక్కటి పరిష్కారం అల్లం. అల్లంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, ఆంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు అధికంగా ఉండడం వల్ల ఇది మనకు ఇమ్యూనిటీని పెంచి ఈ సీజన్లో వచ్చే జలుబు, దగ్గు, జ్వరం నుండి ఉపశమనం కలిగిస్తుంది.
అల్లం లో అనేక రకాలైన పోషకాలు ఉన్నాయి ఇందులో ఐరన్, పొటాషియం, జింక్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఈ సీజన్లో వచ్చే మలేరియా, డెంగ్యు తగ్గించడంలో కూడా ఈ అల్లం చాలా బాగా సహకరిస్తుంది.ఐదు రకాలుగా అల్లాన్ని తీసుకోవడం ద్వారా మీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది.
అల్లం మురబ్బా: ఇది మార్కెట్లో లభిస్తుంది. అల్లంతో తీపి ఘాటు రుచితో ఉంటుంది. ఇది వాత, పిత్తా, కఫా వంటి దోషాలను తగ్గిస్తుంది. చాలామందిలో ఉదయం పూట వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఇది తీసుకున్నట్లయితే వారిలో ఈ సెన్సేషన్ తగ్గిపోయి కడుపుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి.
అల్లం టీ: మనం తీసుకునే రోజు టీ లలో కాస్త అల్లం ముక్కని యాడ్ చేసుకుని అల్లం టీ ని ప్రిపేర్ చేసుకున్నట్లయితే మన ఇమ్యూనిటీ పెరుగుతుంది .అంతే కాకుండా మన జీర్ణం వ్యవస్థ కూడా చాలా మంచిది.
కూరల్లో: ఇలా తీసుకోవడం కుదరనప్పుడు కూరల్లో చాలామంది వాడుతూ ఉంటారు. ఈ అల్లం పేస్టు మీరు ప్రతి కూరలో వాడినట్లయితే మీకు దీనిలో ఉన్న పోషకాలు అన్నీ కూడా లభించి ఈ సీజన్ లో వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి వాటి నుంచి కూడా బయటపడతారు.
Health Tips: తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు మూత్రం లీక్ అవుతుందా ...
అల్లం కషాయం: వేడినీటిలో కాస్త అల్లాన్ని దంచి మరిగించుకొని వడపోసుకొని తాగాలి. ఈ కషాయం వల్ల మనకు జీలసంబంధ సమస్యలు తగ్గిపోతాయి. ఇమ్యూనిటీ పెరుగుతుంది. కడుపుబ్బరం కడుపు మంట వంటి సమస్యల నుంచి బయటపడతారు.
రసం: ఏదైనా రసంలో ఎక్కువ మొత్తంలో అల్లాన్ని కనుక వేసుకున్నట్లయితే ఈ సమస్య నుంచి బయటపడతారు. అంతేకాకుండా మన శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలు అన్నిటిని కూడా బయటికి పంపించడంలో ఈ అల్లం రసం కానీ అల్లం కషాయం చాలా బాగా సహకరిస్తుంది. అంతేకాకుండా అధిక బరువును తగ్గించడంలో కూడా ఈ అల్లము సహాయపడుతుంది. ముఖ్యంగా మన రోగనిరోధక శక్తిని పెంచి వచ్చే వైరస్ వ్యాధులను, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లు తగ్గించడంలో ఈ అల్లం ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.