చాలామందిలో బీపీ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కొందరిలో హై బీపీ ఉంటుంది కొందరిలో బిపి ఉంటుంది. అయితే అది కరెక్ట్ ఫోటో గురించి చాలామందికి వాటి సంకేతాలు వచ్చినప్పటికీ కూడా తెలియదు. అయితే ఉదయం పూట మీరు ఈ లక్షణాలు కనిపిస్తే ఒకసారి గమనించి అవి హైబీపీ లక్షణాలని తెలుసుకోవచ్చు.
బీపీ వల్ల మనకు క్రమక్రమంగా గుండెపోట్లు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. దీని ద్వారా గుండె జబ్బులు, హార్ట్ స్ట్రోక్ కు దారితీస్తుంది. సైలెంట్ కిల్లర్ గా మన ప్రాణాలకు ఇబ్బందిని కలిగిస్తుంది. కాబట్టి ఉదయం ఈ సంకేతాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి.
తల తిరగడం: ఉదయం లేచిన వెంటనే మీకు తల తిరిగినట్టుగా లేదా కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తే మీరు హైబీపీ ఉందని దీనికి సంకేతం.
చూపు మసకబారడం. ఉదయం పూట నిద్రలేచిన వెంటనే మగతగా అనిపించి చూపు మసకబారడం మీకు బీపీ ఎక్కువగా ఉండడానికి సంకేతం.
Health Tips: యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్నారా
నీరసం: రాత్రి ఎక్కువ సేపు నిద్రపోయినప్పటికీ కూడా ఉదయం లేచిన వెంటనే మీరసంగా నిస్సత్తుగా ఉండడం కూడా అధిక రక్తపోటు కి కారణం కావచ్చు.
నోరు పొడి మారడం. ఎంత నీరు తీసుకున్నప్పటికీ కూడా తరచుగా మళ్లీమళ్లీ మీ నోరు పొడిగా ఉంటుంది దీంతో తరచుగా దాహం వేస్తుంది నోరు పొడిబారడం అనేది కూడా హైబీపీకి సంకేతం.
ముక్కు నుండి రక్తస్రావం: ఉదయం లేచిన వెంటనే మీ ముక్కు నుండి అకస్మాత్తుగా రక్తం వస్తే అది అధిక రక్తపోటుకు కారణం. ఒత్తిడి పెరగడం వల్ల మీ సిరలు పలిగిపోవడం ద్వారా ముక్కు నుండి రక్తం రావడం జరుగుతుంది.
తలనొప్పి: ఉదయం లేచిన వెంటనే తలనొప్పి అధికంగా అనిపిస్తే అది హైబీపీకి సంకేతం. ఇది రక్తనాళాల్లో ఒత్తిడిని పెంచడం ద్వారా ఈ తలనొప్పి అనేది తీవ్రంగా వస్తుంది.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది: ఉదయం లేచిన వెంటనే మీరు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది అనిపిస్తే అది కూడా మీ అధిక రక్తపోటుకు సంకేతం. పైన చెప్పిన లక్షణాలన్నీ కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే మీ బీపీ చెక్ చేసుకుని వైద్యుని సంప్రదించాలి. లేకపోతే తీవ్ర అనారోగ్య పరిణామాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.