ప్రస్తుత సమయంలో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. దీన్ని తగ్గించుకోవడం కోసం చాలామంది ఎక్కువ సేపు జిమ్ లో ఉంటున్నారు. వాకింగ్ చేస్తుంటారు అంతే కాకుండా ఆహారాన్ని కూడా తగ్గిస్తూ ఉంటారు. ఎంత చేసినప్పటికీ కూడా వారు బరువు తగ్గరు. వారి కోసం కొన్ని డ్రింక్స్ ఖాళీ కడుపుతో వీటిని తీసుకున్నట్లయితే వేగంగా బరువు తగ్గుతారు. అయితే ఆ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రీన్ టీ: ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీం తీసుకుంటే మీరు ఈజీగా బరువు తగ్గుతారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మీ జీవన క్రియ రేటును వేగవంతం చేసి మెటబాలిజాన్ని పెంచుతాయి. దీని ద్వారా మీ శరీరంలో ఉన్న కొవ్వు ఈజీగా కరిగిపోతుంది. ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోవడం ద్వారా మీకు శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ శాతం తగ్గుతుంది. అంతేకాకుండా మీ చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. ఇది తరచుగా వేసే ఆకలని కూడా తగ్గిస్తుంది.
Health Tips: బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు.
వెజిటేబుల్ వాటర్: కొన్ని రకాలైన కూరగాయ ముక్కలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే మీరు అధిక బరువు నుండి బయటపడతారు. ఇది మీ జీవన క్రియ రేటును పెంచుతుంది. దీని తీసుకోవడం ద్వారా మీ జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్య నుంచి బయటపడి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
గోరువెచ్చని నీరు: ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తీసుకోవడం ద్వారా మీకు మలబద్ధంగా సమస్య నుంచి బయటపడతారు. అంతేకాకుండా ఈ వేడి నీటిలో కాస్త నిమ్మరసం కలిపి తీసుకోవడం ద్వారా మీకు విటమిన్ సి అనేది పుష్కలంగా అందుతుంది. దీని ద్వారా మన శరీరంలో పేరుకుపోయిన మలినాలన్నిటిని కూడా తొలగించడంలో ఈ నీరు సహాయపడుతుంది .అంతేకాకుండా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ఎండు ద్రాక్ష మీరు: ఉదయం ఖాళీ కడుపుతో ఎండు ద్రాక్ష నానబెట్టిన నీటిని తాగడం ద్వారా మీ శరీరానికి పోషకాల లభించడంతోపాటు బరువు ఈజీగా తగ్గుతారు. ఇందులో ఉన్న ఐరన్ జింక్ కంటెంట్ లో మీ రక్తహీనతకు చక్కటి పరిష్కారం అంతే కాకుండా దీన్ని తీసుకోవడం ద్వారా మీ ఆకలిని తగ్గిస్తుంది. దీని ద్వారా మీరు ఈజీగా బరువు తగ్గుతారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.