Snake-Gourd

పొట్లకాయ ఈ సీజన్లో వచ్చే పోషకాహారమైన కూరగాయ. దీనిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ పొట్లకాయ తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలు తినడం మంచిది కాదు. అంతే కాకుండా పొట్లకాయతో కొన్ని ఆహార పదార్థాలు కలపడం కూడా మంచిది కాదు. దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. పొట్లకాయ తర్వాత పొరపాటున కూడా తినకూడని ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పాలు, పాల ఉత్పత్తులు: పొట్లకాయ తిన్న తర్వాత పొరపాటున కూడా పాలు ,పాల ఉత్పత్తులు తీసుకోకూడదు. దీనివల్ల తీవ్ర జీర్ణ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వాంతులు, కడుపు నొప్పి ,అజీర్ణం సమస్యలు ఏర్పడతాయి. అంతేకాకుండా పోషకాలు కోల్పోవడం వల్ల మన శరీరానికి తగినంత పోషకాలు అందించవు.

స్వీట్లు: పొట్లకాయ తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా తీపి పదార్థాలు తినకూడదు. ఇది కూడా జీర్ణ వ్యవస్థ పైన తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మలబద్ధకం, గ్యాస్, సమస్యలు ఏర్పడతాయి. అంతేకాకుండా డయాబెటిక్ పేషెంట్లు అయితే గ్లూకోజ్ లో ఇంటాలెరెన్స్ ఏర్పడి వారి చక్కర స్థాయిలు అమాంతంగా పెరుగుతాయి. కాబట్టి పొట్లకాయ తీసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా స్వీట్లు తీసుకోకూడదు.

Health Tips: పీరియడ్స్ లో రాషెస్ సమస్య తో బాధపడుతున్నారా

సిట్రస్ పండ్లు: పొట్లకాయ తిన్న తర్వాత ఎటువంటి సిట్రస్ పండ్లను తీసుకోకూడదు. దీనివల్ల కడుపునొప్పి, కడుపులో మంట ఏర్పడతాయి. ఎక్కువగా ఉంటుంది కనుక పొట్లకాయతో కలిపి తీసుకుంటే ఇది ఇంకా ఎసిడిటీని ఫార్మ్ చేసి ఒక్కసారి తీవ్రంగా వాంతులు అయ్యే అవకాశాలు ఉంటాయి.

కాఫీ, టీలు: పొట్లకాయ తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కాఫీ, టీలు తీసుకోకూడదు. అంతే కాకుండా మద్యం కూడా తీసుకోకూడదు. దీనివల్ల శరీరంలో విష పదార్థాలు ఎక్కువైపోయి మన జీర్ణ వ్యవస్థ పైన తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా జ్ఞాపక శక్తి కూడా ప్రభావాన్ని చూపుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.